సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ వేడెక్కడం మనం గమనిస్తూనే ఉంటాం. నెట్‌వర్క్ రాడార్ నిరంతరం పనిచేయడమే దీనికి కారణం. ఫోన్ బాగా వేడెక్కినప్పుడు కాసేపు ఏర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేస్తే, నెట్‌వర్క్ సెర్చింగ్ ఆగిపోయి ప్రాసెసర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల ఫోన్ త్వరగా చల్లబడుతుంది. తిరిగి మోడ్ ఆఫ్ చేసినప్పుడు నెట్‌వర్క్ రీఫ్రెష్ అయి, సిగ్నల్ కూడా త్వరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.