AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. ఒక్క నెలలోనే అన్ని లక్షల కార్లు అమ్మేసిందా? మారుతి సుజుకి కొత్త రికార్డ్

జూలై 2026లో మారుతి సుజుకి చరిత్ర సృష్టించింది. దేశీయంగా పెద్ద సంఖ్యలో కార్లను విక్రయించి కొత్త రికార్డు నెలకొల్పింది. మొత్తం 2.41 లక్షల వాహనాలను పంపిణీ చేయగా, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్, ఇ-విటారా వంటి కొత్త మోడళ్లకు భారీ బుకింగ్‌లు నమోదవుతున్నాయి. సంస్థ వద్ద ప్రస్తుతం 1.60 లక్షల పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయి.

అమ్మబాబోయ్.. ఒక్క నెలలోనే అన్ని లక్షల కార్లు అమ్మేసిందా? మారుతి సుజుకి కొత్త రికార్డ్
Maruti Suzuki Cars
SN Pasha
|

Updated on: Aug 03, 2026 | 2:24 PM

Share

అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జూలై 2026లో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. ఒకే నెలలో దేశీయ మార్కెట్లో 2 లక్షలకు పైగా వాహనాలను విక్రయించి, భారతీయ ఆటోమొబైల్ రంగంలో కొత్త రికార్డును సృష్టించింది. మొత్తం 2,41,241 వాహనాలను పంపిణీ చేసిన సంస్థలో 30,056 యూనిట్లు ఎగుమతులకు వెళ్లగా, దేశీయంగా 2,00,123 వాహనాలు అమ్ముడయ్యాయి.

దేశీయ అమ్మకాలలో ప్యాసింజర్ వాహనాల (PV) వాటా 1,93,203 యూనిట్లు కాగా, కమర్షియల్ వాహనాల (CV) అమ్మకాలు 3,920 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది జూలైలో మొత్తం 1,80,526 వాహనాలు విక్రయించిన మారుతి సుజుకి, ఈసారి ఆ సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. అలాగే జూలై 2025లో దేశీయ అమ్మకాలు 1,40,570 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది 2 లక్షల మార్క్‌ను దాటడం విశేషం.

మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బానర్జీ మాట్లాడుతూ, ప్రస్తుతం సంస్థ వద్ద సుమారు 1.60 లక్షల పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయని తెలిపారు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌కు ప్రతిరోజూ దాదాపు 2,000 బుకింగ్‌లు వస్తుండగా, ఎలక్ట్రిక్ SUV అయిన ఇ-విటారాకు ప్రతి నెలా సుమారు 4,000 బుకింగ్‌లు నమోదవుతున్నాయని వెల్లడించారు. పెరుగుతున్న డిమాండ్, కొత్త మోడళ్లకు లభిస్తున్న ఆదరణతో రానున్న నెలల్లో కూడా అమ్మకాలు మరింత బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రబ్బర్ తెల్లగా వస్తే టైర్ ఎందుకు నల్లగా ఉంటుంది?
రబ్బర్ తెల్లగా వస్తే టైర్ ఎందుకు నల్లగా ఉంటుంది?
FDలో డబ్బులు పెడుతున్నారా? వయసును బట్టి మారే ఈ రూల్స్ తెలుసుకోండి
FDలో డబ్బులు పెడుతున్నారా? వయసును బట్టి మారే ఈ రూల్స్ తెలుసుకోండి
ఇరుముడి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
ఇరుముడి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు..
శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు..
ఓరేయ్.. ఎంతపని చేశావురా.. అందరూ తినే ఆయిల్‌ ట్యాంక్‌లోకి దిగి
ఓరేయ్.. ఎంతపని చేశావురా.. అందరూ తినే ఆయిల్‌ ట్యాంక్‌లోకి దిగి
శ్రీలంక పై గెలిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్లేస్ ఇదే
శ్రీలంక పై గెలిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్లేస్ ఇదే
దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన
దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!