AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు.. వీళ్లు చేసిన దారుణం తెలిస్తే..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆగ్రా రైల్వే స్టేషన్ ట్రాలీ బ్యాగ్ హత్య కేసు మిస్టరీ వీడింది. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో నమ్మలేని భయానక నిజాలు బయటపడ్డాయి. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వంటింట్లో కనిపించిన దృశ్యాలు నివ్వెరపోయేలా చేశాయి. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు.. వీళ్లు చేసిన దారుణం తెలిస్తే..
Tamilnadu Express Trolley Bag Murder Mystery Solved
Krishna S
|

Updated on: Aug 24, 2026 | 9:58 AM

Share

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఆగ్రా రైల్వే స్టేషన్ ట్రాలీ బ్యాగ్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై సమీపంలో ఓ మహిళను అత్యంత కిరాతకంగా చంపి, శరీర భాగాలను బిర్యానీ పాత్రలో దాచిన అమానుష ఘటన వెలుగుచూసింది. ఆగస్టు 5న ఆగ్రా రైల్వే స్టేషన్‌లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్‌లో తల లేని, కుళ్లిపోయిన మహిళ మొండెం లభ్యమైంది. ఆగ్రా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. మృతురాలు ఒడిశాకు చెందిన హయాతున్ నిషాఅని, ఆమె చెన్నై గూడువాంచేరి ప్రాంతంలో నివసిస్తూ పని చేస్తుందని గుర్తించారు.

సీసీటీవీ, మొబైల్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు

దీంతో చెన్నై సెంట్రల్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ రంగంలోకి దిగాయి. ఆగస్టు 3 రాత్రి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని 4వ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ మహిళ, పురుషుడు అనుమానాస్పదంగా ఆ ట్రాలీ బ్యాగ్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల ఆచూకీని చెంగల్పట్టు జిల్లా గూడువాంచేరి మసీదు వీధిలోని ఓ అద్దె ఇల్లుగా గుర్తించారు.

బిర్యానీ పాత్రలో మరికొన్ని శరీర భాగాలు

పోలీసులు ఆ ఇంటికి వెళ్లి సోదాలు చేయగా భయానక దృశ్యం కనిపించింది. వంటింట్లో ఉన్న ఓ పెద్ద బిర్యానీ పాత్రలో ముక్కలుగా నరికిన మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. దుర్వాసన రాకుండా ఉండేందుకే నిందితులు శరీర భాగాలను ఆ పాత్రలో దాచినట్లు గుర్తించారు. మృతురాలు హయాతున్ నిషా, అసోంకు చెందిన మణిక్ ఉదిన్ లస్కర్, ఒడిశాకు చెందిన భగవతి మాజీతో కలిసి ఆ ఇంట్లో నివసిస్తోంది. వారి మధ్య వచ్చిన వివాదాల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. హత్యానంతరం మొండేన్ని ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి రైలులో వదిలేసి, మిగిలిన భాగాలను ఇంట్లోనే వదిలి నిందితులు పరారయ్యారు.

నిందితుల కోసం గాలింపు

సంఘటనా స్థలాన్ని ఉన్నతాధికారులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ పరిశీలించి వేలిముద్రలు, రక్తపు నమూనాలను సేకరించాయి. పరారీలో ఉన్న మణిక్ ఉదిన్ లస్కర్, భగవతి మాజీల కోసం ప్రత్యేక బృందాలు అసోం, ఒడిశా రాష్ట్రాలకు బయలుదేరాయి. వివాహేతర సంబంధమా లేక ఆర్థిక లావాదేవీల వల్ల ఈ దారుణం జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..