OTT Movie: అమ్మాయిలను పాశవికంగా హత్య చేసే ఆటో డ్రైవర్.. ఓటీటీలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో మంచి ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వెబ్ సిరీస్ మీకు మంచి ఛాయిస్. తమిళనాడును గజగజలాడించిన ఒక రియల్ సైకో కిల్లర్ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది.

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీనే. కొన్నేళ్ల క్రితం తమిళనాడును గజగజలాడించిన ఒక సైకో కిల్లర్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ క్రైమ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథ కథనాలు, ఉత్కంఠరేపే సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ ఓటీటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా నిలిచింది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉండే ఈ వెబ్ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ దాదాపు 30 నిమిషాల నిడివితో సాగుతుంది. ఐఎమ్ డీబీలోనూ ఈ వెబ్ సిరీస్ కు టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు బాగా ఇష్టపడే వారు కచ్చితంగా చూడాల్సిన ఈ వెబ్ సిరీస్ పేరు ఆటో శంకర్. 2019లో వచ్చిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీని షేక్ చేసింది. చెన్నైలో ఒకప్పుడు ప్రజలను భయపెట్టిన గౌరీ శంకర్ అలియాస్ ఆటో శంకర్ జీవితంలోని చీకటి కోణాలను ఆధారంగా చేసుకుని ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.. చిన్న స్థాయి ఆటో డ్రైవర్‌గా మొదలైన అతడి ప్రయాణం.. నేర సామ్రాజ్యం, హత్యలు, రాజకీయ సంబంధాలు, పోలీసులతో కుమ్మక్కై చివరకు అతని ప్రయాణం ఎలా ముగిసిందో ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కి మెయిన్ హైలైట్ హీరో అప్పాని శరత్ యాక్టింగ్. మలయాళంలో ‘అంగమాలి డైరీస్’, తమిళంలో ‘సందకోళి 2’ లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న శరత్.. ఈ ఆటో శంకర్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడని చెప్పవచ్చు. రంగా యల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కి మరో మెయిన్ అస్సెట్ బీజీఎమ్. అలాగే ప్రతి ఎపిసోడ్ కూడా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులు ఆడియన్స్‌ను సీటు అంచున కూర్చోబెడతాయి. ప్రస్తుతం ఆటో శంకర్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆటో శంకర్ వెబ్ సిరీస్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




