అరెరే ఇంట్లో షాంపూ తయారు చేయడం ఇంత సింపులా.. ఇది తెలీక ఇన్నాళ్లు డబ్బులు వేస్ట్ చేశామే
Natural Shampoo: జుట్టు బలంగా ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం మార్కెట్‌లో దొరికే అనేక రకాల షాంపూలను వాడుతూ ఉంటారు. కానీ వాటిని వాడినప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేరు. అలాంటి వారు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే సహజం షాంపూలను వాడవచ్చు. ఇవి జుట్టు సంరక్షణకు ఎంతగానో సహాయపడుతాయి. కాబట్టి ఇంట్లోనే ఈజీగా శాంపూను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.

ఈ రోజుల్లో మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మందికి చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడడం, రాలిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. దానికి చెక్ పెట్టేందుకు మార్కెట్‌లో దొరికే అనేక రకాల షాంపూలను వాడుతూ ఉంటారు. అయినప్పిటకీ ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాకపోవచ్చు. మీరు కూడా ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తే.. ఈ చిట్కా మీకోసమే.. మీరు ఇంట్లోనే సులభంగా సహజ శాంపునూ తయారు చేసుకోవచ్చు. అవును ప్రముఖ బ్యూటీషియన్ జ్యోతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకరాం.. ఇంట్లోనే మందార పువ్వులు, ఇతర వస్తువులను ఉపయోగించిర షాంపూను తయారు చేయడానికి ఒక సులభమైన పద్ధతిని వివరించారు. ఈ సహజ శాంపు జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు.
పోస్ట్ చూడండి..
View this post on Instagram
ఇంట్లో షాంపూ తయారీకి కావాల్సిన పదార్థాలు:
15 నుండి 20 గ్రాముల ఎండిన మందార పువ్వులు, 40 గ్రాముల రీఠా , 40 గ్రాముల ఎండిన ఉసిరికాయ , 4 నుండి 5 గ్రాముల రోజ్మేరీ , 2 నుండి 3 గ్రాముల భృంగరాజ్ , 15 నుండి 20 గ్రాముల మెంతి గింజలు , 25 గ్రాముల అవిసె గింజలు ,4 నుండి 5 గ్రాముల ఎండిన గులాబీ రేకులు ఉంటే సరిపోతుంది.
తయారీ విధానం:
స్టెప్-1: ముందుగా, కుంకుడుకాయ, ఉసిరి, రోజ్మేరీ, భృంగరాజ్, మెంతులను ఒక పెద్ద గిన్నెలో వేసి బాగా కలపాలి. తర్వాత వాటిని 2 నుండి 3 కప్పుల శుభ్రమైన నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం ఈ నీటితో అన్ని పదార్థాలను వేసి 8 నుండి 10 నిమిషాల పాటు ఉడకబెల్లాలి. తర్వాత, దాని నీటిని వడకట్టి, ఒక శుభ్రమైన గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.
స్టెప్-2: ఇప్పుడు, అన్నింటిలో మరోసారి నీళ్ళు పోసి మరిగించాలి. తర్వాత, నీటిని కొద్దిగా చల్లారనిచ్చి. తర్వాత చేతులతో బాగా పిసకాలి. దాని నుంచి నురగ నీరు వస్తుంది. దానిని వడకట్టి, మీరు ముందుగా సిద్ధం చేసుకున్న మరిగించిన నీటిలో కలపాలి. ఇప్పుడు, మీకు గోధుమ రంగులోని ద్రవం వస్తుంది. దాన్ని అలానే పక్కన ఉంచుకోవాలి.
స్టెప్-3: ఇప్పుడు ఒక బాణలిలో ఎండిన మందార పువ్వులు, అవిసె గింజలు, ఎండిన గులాబీ రేకులను వేసి, అందులో ఒకటి నుండి ఒకటిన్నర కప్పు నీరు పోసి బాగా మరిగించాలి. అప్పుడు అది జల్‌లా మారుతుంది. వెంటనే దాన్ని వడకట్టి, ముందుగా సిద్ధం చేసుకున్న నీటిలో కలపాలి. ఆ తర్వా ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేస్తే చాలు, మీ ఇంట్లో తయారుచేసిన షాంపూ రెడీ అయినట్టే మీరు దీనిని మీ జుట్టు క్లీనింగ్ వాడుకోవచ్చు.
గమనిక: పైన పేర్కొన్న ఆర్టికల్‌లోని అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు. వీటిని వాడే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
