ఆరు చుట్టూ ప్యాన్ ఇండియా ఆర్భాటం.. టీమ్ రాహుల్ దెబ్బకు జ్ఞానేష్‌కు గండం తప్పదా?
బ్లాక్‌బస్టర్ అవుతుందనుకున్న బొమ్మ డిజాస్టర్ ఐనప్పుడు.. ఒక టాప్ హీరో డైరెక్టర్‌గారిని ఉద్దేశించి.. కమ్ టు మై రూమ్ అని ఘాటుగా ఒక సైగ చేస్తాడు. ఇండియన్ సెల్యులాయిడ్‌లో సూపర్‌గా వైరలైన ఒకానొక ట్రెండీ లైన్ ఇది. ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ మెలోడ్రామాలో కూడా అదే సీన్ రిపీటైనట్టుంది. It's All Done Bro అని అన్ని కార్నర్స్ నుంచి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అదేపనిగా దున్నేస్తుంటే, ఊస్టింగ్ అర్డర్ కూడా టైపౌతున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి సౌండ్ వస్తోంది. కమ్‌టు మై రూమ్ సిట్యువేషన్‌లోనే పడ్డట్టున్నాడు ఎలక్షన్ కమిషన్‌లో చీఫ్ డైరెక్టర్‌గారు. అవును, ఎస్‌ఐఆర్ అనే ఒక భారీ సినిమా ఇంతటి డిజాస్టర్ అయ్యిందంటే, కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చిందంటే, ఇదంతా ఆరు చుట్టూ జరిగిన-జరుగుతున్న ఆ ఆర్భాటం వల్లేనా..? ఇండియన్ పాలిటిక్స్‌ని తిరగమాత పెట్టేస్తున్న సూపర్‌సిక్స్ ఎలిమెంట్..

అరె, ఫామ్-6నే మార్చేశారా? కొత్త ఓటుకే తూట్లు పొడిచేశారా? మాకే తెలీదే, మమ్మల్ని ఎవరూ అడగనేలేదే.. అని సుప్రీంకోర్టే బ్లాంక్‌ఫేస్ పెట్టేసింది. తమ అనుమతి లేకుండా ఎవరు ఎందుకు ఫామ్-6ని మార్చారో తేల్చేస్తాం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సీఈసీకి ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. సరిగ్గా ఇక్కడే అలర్ట్ ఐనట్టుంది టీమ్ అపోజిషన్. ఈ ఒక్క హింట్ చాలు.. ఇక రెచ్చిపోతా చూడు అన్నట్టుంది ఢిల్లీలో రాహుల్ దూకుడు. గాంధీగిరీ పేరుతో ఢిల్లీలో రాహుల్ కెప్టెన్సీలో ఇండీ కూటమి పెద్ద హల్‌చలే చేస్తోంది. ఫామ్ సిక్స్‌నే మెయిన్ ఎజెండాగా మార్చుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చుకుని, మరింత ర్యాపిడ్‌గా దూసుకుపోతోంది విపక్ష కూటమి. కాకపోతే, ఫామ్ సిక్స్‌కి తోడుగా మరో సూపర్‌సిక్సర్ కూడా యాడైంది. ఏమిటది? అక్టోబర్ ఆరో తేదీన మొత్తం ఆరు డిమాండ్లతో పెద్ద వారే షురూ చేసింది ఇండీ కూటమి. డిమాండ్లు కాదు డైనమైట్లు, శక్తివంతమైన మందుపాతర్లు, పేలే తీరతాయి అని ఎన్‌డీఏ సర్కార్ మీద ఒత్తిడిని ఓ రేంజ్‌లో పెంచే ప్రయత్నంలో ఉంది అపోజిషన్ దండు. వన్‌మ్యాన్ షో నడిపించారన్న అభియోగాలు వచ్చీ రాగానే, CEC జ్ఞానేష్‌కుమార్ చుట్టూ అభిశంసన ఉచ్చు బిగిద్దామని మొదట్లో అనుకుంది. అది అంత ఈజీ కాదని, టెక్నికల్‌గా సాధ్యం కాదని తెలిసొచ్చి, ఇప్పుడు సాలిడ్‌గా ప్లాన్‌బీని అమల్లో పెట్టింది. రాజ్యాంగ పోరాటం కంటే, రాజకీయ పోరాటమే బెటరని డిసైడయ్యి.. ఇదిగో ఇలా...
