రష్మిక మందన్నా పోస్ట్.. గతంలో ఎప్పుడూ చేయని పనులను చేశానంటూ !!
భారతీయ సినీ పరిశ్రమలో 'నేషనల్ క్రష్'గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్న. ఈ భామ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా రష్మిక సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

భారతీయ సినీ పరిశ్రమలో ‘నేషనల్ క్రష్’గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్న. అనతికాలంలోనే పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు. కర్ణాటకలోని విరాజ్‌పేటలో జన్మించిన ఈ భామ.. 2016లో కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోగా.. ఆ తర్వాత ‘అంజనీ పుత్ర’, ‘చమక్’ వంటి హిట్ చిత్రాలతో కన్నడ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కాగా 2018లో ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ‘గీత గోవిందం’ చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగారు.
తెలుగు, కన్నడ భాషలతో పాటు తమిళంలో ‘సుల్తాన్’, ‘వారిసు’ చిత్రాల్లో నటించారు. అనంతరం బాలీవుడ్‌లో అడుగుపెట్టి ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’ చిత్రాలు చేశారు. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించిన ‘యానిమల్’ సంచలన విజయం సాధించడంతో బాలీవుడ్‌లోనూ ఆమెకు తిరుగులేని గుర్తింపు లభించింది. అంతే కాకుండా అల్లు అర్జున్ సరసన నటించిన ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్ర ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మైసా’. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన ఈ బ్యూటీ.. ఈ సినిమాలో మాత్రం పూర్తి భిన్నమైన అవతారంలో అలరించనుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె గోండు తెగకు చెందిన యువతిగా కనిపించనుంది. ఈ సినిమాలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రాహుల్ రవీంద్రన్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా.. అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సాయిపురెడ్డి, వీరసాయి గోప ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రత్యేకమైన అనుభవం అంటూ..
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో రష్మిక ఒక ఆసక్తికర పోస్టును సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో.. ‘మైసాగా మారే ప్రయాణం షూటింగ్ ప్రారంభానికి చాలాకాలం ముందే మొదలైంది. శిక్షణ, రోజూ ఎదురైన చిన్న చిన్న సవాళ్లు.. గతంలో ఎప్పుడూ చేయని పనులను చేసేందుకు నన్ను నేను ప్రోత్సహించుకోవడం.. ఇదొక ప్రత్యేకమైన అనుభవం’ అంటూ తన రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన వీడియోలో స్టంట్, కంబాట్ శిక్షణకు సంబంధించిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రంలో ఓ పాటను షూట్ చేస్తుండగా ఈ స్టార్ హీరోయిన్ గాయపడిన విషయం తెలిసిందే.
ఇక మరోవైపు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. చాలా ఏళ్లపాటు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా వివాహం జరుపుకుంది. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ పూర్తయింది. ఇక వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ చేసింది విజయ్ టీమ్. రీసెంట్ గానే వీరిద్దరూ కలిసి నటించిన రణబాలి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది.
నన్ను నేను ప్రోత్సహించుకున్నా..
Becoming Mysaa was a journey that started way before the cameras started rolling.. The training, the preparation, the little challenges every day and pushing myself to do things I hadn’t done before.. ❤️
@unformulafilms @RawindraPulle @jakes_bejoy @TSeries @tseriessouth https://t.co/ErNv5pZZey
— Rashmika Mandanna (@iamRashmika) November 18, 2026
