AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు అలర్ట్! ఇంటర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల.. ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు ఎప్పుడంటే?

Telangana Inter 2027 Timetable Released: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి 2027 ఇంటర్ పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ప్రాక్టికల్, అంతర్గత మూల్యాంకనం, ఎథిక్స్, ఎన్విరాన్‌మెంటల్, థియరీ పరీక్షల తేదీలు ఇందులో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 24 నుండి మార్చి 19 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 20 వరకు జరగనున్నాయి. విద్యార్థులకు ఇది సన్నద్ధతకు ఉపయోగపడుతుంది.

విద్యార్థులకు అలర్ట్! ఇంటర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల.. ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు ఎప్పుడంటే?
Telangana Inter Exams 2027
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 19, 2026 | 4:05 PM

Share

Telangana Inter 2027 Timetable Released: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి 2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక టైమ్‌ టేబుల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ వొకేషనల్ కోర్సుల పరీక్షలకు కూడా వర్తిస్తుందని, అయితే వాటి ప్రత్యేక టైమ్‌టేబుల్‌ను వేరుగా జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయడానికి ఈ తాత్కాలిక షెడ్యూల్ ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రాక్టికల్ పరీక్షలు, అంతర్గత మూల్యాంకనం విషయానికి వస్తే, ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ను 20-01-2027 నుంచి 25-01-2027 వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 27-01-2027 ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతుంది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష 29-01-2027 ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఫస్ట్ ఇయర్‌కు 29-01-2027న, సెకండ్ ఇయర్‌కు 30-01-2027న జరుగుతాయి. సెకండ్ ఇయర్ సైన్స్ సబ్జెక్టుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆదివారాలతో సహా రెండు సెషన్లలో ఉదయం 9.00 నుంచి 12.00 వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 వరకు జరుగుతాయి. కొత్త విధానం ప్రకారం ఫస్ట్ ఇయర్ సైన్స్ సబ్జెక్టుల ప్రాక్టికల్స్ 11-02-2027 నుంచి 18-02-2027 వరకు ఆదివారంతో సహా ప్రతి సెషన్ రెండు గంటల చొప్పున మూడు సెషన్లలో నిర్వహించనున్నారు.

థియరీ పరీక్షలన్నీ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 24-02-2027న 2వ లాంగ్వేజ్ పేపర్-1తో మొదలై, 26-02-2027న ఇంగ్లీష్ పేపర్-1, 02-03-2027న మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, ACE గ్రూప్‌కు అకౌంటెన్సీ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. 05-03-2027న మ్యాథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, ACE గ్రూప్‌కు కామర్స్ పేపర్-1 ఉంటాయి. 09-03-2027న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, 15-03-2027న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ & అకౌంటెన్సీ పేపర్-1, 17-03-2027న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, MEC గ్రూప్‌కు మ్యాథమెటిక్స్ పేపర్-1, ఇక చివరి రోజు 19-03-2027న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1, బైపీసీ విద్యార్థుల కోసం బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-1 పరీక్షలతో ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షలు ముగుస్తాయి.

అలాగే సెకండ్ ఇయర్ థియరీ పరీక్షలు 25-02-2027న 2వ లాంగ్వేజ్ పేపర్-2తో ప్రారంభమవుతాయి. 27-02-2027న ఇంగ్లీష్ పేపర్-2, 03-03-2027న మ్యాథమెటిక్స్ పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2, 08-03-2027న మ్యాథమెటిక్స్ పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి.

12-03-2027న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, 16-03-2027న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ & అకౌంటెన్సీ పేపర్-2, 18-03-2027న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, చివరగా 20-03-2027న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2, బైపీసీ విద్యార్థుల కోసం బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-2 పరీక్షలతో సెకండ్ ఇయర్ పరీక్షలు పూర్తవుతాయి.

Follow Us
విద్యార్థులకు అలర్ట్! ఇంటర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల..
విద్యార్థులకు అలర్ట్! ఇంటర్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల..
స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే వి.ఎస్. బాబు మృతి
స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే వి.ఎస్. బాబు మృతి
ఒక్కపూట అన్నం పెట్టిన మహిళకు రజినీకాంత్ ఇచ్చిన బహుమతి ఏంటంటే..
ఒక్కపూట అన్నం పెట్టిన మహిళకు రజినీకాంత్ ఇచ్చిన బహుమతి ఏంటంటే..
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్‌!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్‌!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!
దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో
దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో
కార్తీక పౌర్ణమి రోజున ఈ తప్పులు చేయకండి.. తులసి నుంచి ఆహారం వరకు
కార్తీక పౌర్ణమి రోజున ఈ తప్పులు చేయకండి.. తులసి నుంచి ఆహారం వరకు
మీ పేరుతో పాత బ్యాంక్ అకౌంట్ ఉందా..? క్షణాల్లోనే వివరాలు..
మీ పేరుతో పాత బ్యాంక్ అకౌంట్ ఉందా..? క్షణాల్లోనే వివరాలు..
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
ఏముంటంది భయ్యా ఈ పాట.. వింటూ ఉండిపోవాల్సిందే..
ఏముంటంది భయ్యా ఈ పాట.. వింటూ ఉండిపోవాల్సిందే..
సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే..అలాంటి వాటిని కట్టడి చేయండి
సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే..అలాంటి వాటిని కట్టడి చేయండి