
ప్రియాంక గాంధీ
52 ఏళ్ల ప్రియాంక గాంధీ.. రాజీవ్‌గాంధీ కూతురిగా కాంగ్రెస్ పార్టీ ఐకాన్‌లలో ఒకరుగా.. ఇందిరాగాంధీ పోలీకలున్న నాయకురాలిగా దేశ రాజకీయాల్ని పరోక్షంగా ప్రభావితం చేశారు. కానీ.. దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ.. ఐదేళ్ల కిందటే యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ ఈస్ట్ రీజియన్ ఇన్‌చార్జిగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు.
1989లో అమేథిలో తండ్రి రాజీవ్‌గాంధీ తరఫున ప్రచారం చేశారు. 1999లో ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. 2009లో సుల్తాన్‌పూర్ సీటు నుంచి పోటీచేస్తారన్న ప్రచారం జరిగింది. 2014లో మోదీ హవాను ఢీకొట్టేందుకు ప్రియాంకాగాంధీని అరంగేట్రం చేయించేందుకు కాంగ్రెస్‌లో ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నించింది. 2017లో కాంగ్రెస్ వ్యూహకర్తగా వచ్చిన ప్రశాంత్‌కిషోర్.. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావల్సిందే అని పట్టుబట్టారు. 2019లో ఏఐసీసీ జెనరల్ సెక్రటరీగా పార్టీ క్లోజ్ సర్క్యూట్‌లోకి వచ్చారు. కానీ.. ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. ఇన్ని మలుపుల్లోనూ దూరంగానే నిలబడ్డ ప్రియాంక.. ఇప్పుడు వయనాడు ఉపఎన్నిక సమయానికి ఓట్ల పోటీకి రెడీ చెప్పేశారు.
నానమ్మ ఇందిర లుక్‌లో కనిపించిన ప్రియాంక గాంధీ! ప్రత్యేక కేరళ చీర ధరించి, ఎంపీగా ప్రమాణ స్వీకారం
ప్రియాంక కేరళ కాటన్ జారీ చీర ధరించి కట్టుబొట్టుతో అక్కడి సంస్కృతి ప్రతిభించేలా లోక్‌సభకు హాజరయ్యారు.
- Balaraju Goud
- Updated on: Nov 28, 2024
- 1:04 pm
Elections-2024: ముగిసిన ప్రచారం.. వయనాడ్ సహా దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు రేపే పోలింగ్!
సోమవారం సాయంత్రం ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రెండు చోట్లా నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాయనాడ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: Nov 12, 2024
- 9:34 am