AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవ్వలడ్డూలు మెత్తగా, మధురంగా ఉండాలా.. ఈ ట్రిక్ మీకోసమే

రవ్వ లడ్డూలు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరికీ లడ్డూలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇక చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగాా తింటారు. అయితే ఈ లడ్డూలు చాలా మెత్తగా మధురంగా ఉండాలి అంటే చిన్న ట్రిక్ పాటించాలంట. అది ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 06, 2026 | 6:05 PM

Share
రవ్వలడ్డూలు తయారు చేసే సమయంలో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో మిగితా పదార్థాలను సరిసమానంగా తీసుకోవాలి. అప్పుడే రవ్వ లడ్డూలు చాలా మెత్తగా, దూదిలా, మధురంగా ఉంటాయంట. కానీ కొందరు ఒక కప్పు రవ్వకు అరకప్పు చక్కెర ఇలా తీసుకుంటారు. ఇది లడ్డూ రుచినే మార్చి వేస్తుందంట.

1 / 5
రవ్వ లడ్డూల తయారీలోకి వెళ్లితే.. ముందుగా,  స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి పావు కప్పు నెయ్యివేసి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ను  మంచి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం కొలిచి తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వను మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. రవ్వ 50% వేగాక, అందులోకి ఒక కప్పు కాచిన పాలను  తీసుకొని రవ్వలో పోసి మంచిగా మొత్తం కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి.

2 / 5
పాలు కలిపాక, రవ్వ అనేది మళ్ళీ పొడిపొడిగా వచ్చేవరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. రవ్వను ఎంత బాగా వేయించి లడ్డులూ చేస్తే అంత రుచిగా వస్తాయి.  రవ్వ బాగా వేగి, పొడిపొడిగా వచ్చాక, ఒక బౌల్ లోకి తీసుకోండి.  ఇప్పుడు ఈ వేయించిన రవ్వలోకి ముందుగా వేయించి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ ను వేసి బాగా కలపండి. ఆ తర్వాత స్వీట్ కి సరిపడా చక్కెరను ,మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకులను కలిపి మెత్తగా గ్రైండ్ చేసిన పంచదార పొడిని రవ్వలోకి తీసుకుని బాగా కలపండి.

3 / 5
అన్ని కలిపిన తర్వాత, లడ్డు చుట్టడం వీలవుతుందో లేదో అని కొద్దిగా తీసుకుని ప్రయత్నించండి. మీకు లడ్డులు సులువుగా చుట్టగలిగితే అలాగే చుట్టేయవచ్చు. ఒకవేళ కొంచెం డ్రైగా అనిపిస్తే, ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా వేడిచేసి రవ్వ మిశ్రమంలో వేసి కలపండి.

4 / 5
 ఇలా వేడి నెయ్యి వేయడం వలన లడ్డులూ మరింత రుచిగా, చాలా మృదువుగా ఉంటాయి. అంతేకాకుండా, ఇలా నెయ్యి వేసి చేయడం వల్ల లడ్డులు 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి.  అంతే కాకుండా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అంతే టేస్టీ టేస్టీ రవ్వ లడ్డూ రెడీ. చిన్న పిల్లలే కాకుండా, పెద్ద వారు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు.

5 / 5
Follow Us