AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్ర విషాదం: ఆడుకోవడానికి స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గుండెలను పిండేసే ప్రమాదం చోటుచేసుకుంది. సరదాగా స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లిన ఓ చిన్నారి లిఫ్టు ప్రమాదానికి గురై దుర్మరణం పాలైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని, ప్లాట్‌ఫారమ్‌లలో సురక్షిత ప్రమాణాలపై ఆందోళనను రేకెత్తించింది. ఏకైక కుమార్తె కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తీవ్ర విషాదం: ఆడుకోవడానికి స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
12 Year Old Girl Dies In Lift Accident,
Jyothi Gadda
|

Updated on: Aug 24, 2026 | 9:54 AM

Share

కొత్తపేటకు చెందిన భవిరిశెట్టి ఆనంద్ మహేష్, మణిదీపిక దంపతుల ఏకైక కుమార్తె రేవతి (12) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆదివారం కావడంతో రేవతి సమీపంలోని తమ స్నేహితుల ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళింది. ఆ మూడంతస్తుల భవన యజమాని కోటేశ్వరరావు కుటుంబం కొన్నిరోజుల కిందటే నూతనంగా లిఫ్ట్‌ను ఏర్పాటు చేసుకుంది.

పిల్లలు ఆడుకుంటున్న సమయంలో సాయంత్రం వేళ ప్రమాదవశాత్తు రేవతి ఆ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వచ్చి చూడగా, రేవతి తీవ్ర గాయాలతో పడిపోయి ఉంది. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆడుకోవడానికి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఏకైక కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డోర్లు సరిగ్గా మూసుకోకుండానే లిఫ్ట్ పైకి వెళ్లడం, ప్లాస్టిక్ షీట్లు పగిలిపోవడం వంటి అంశాలను లేవనెత్తుతూ ఇది కేవలం ప్రమాదం కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉండవచ్చని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న సత్తెనపల్లి డీఎస్పీ చైతన్య క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. భవనంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, లిఫ్ట్‌లోని సాంకేతిక లోపాలు లేదా నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగిన తీరుపై సమగ్ర దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా