AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాఫీ విత్‌ కొబ్బరి నూనె ట్రై చేసి చూడండి.. నెలరోజుల్లోనే మీ నడుం మల్లెతీగలా అవ్వాల్సిందే..!

ప్రస్తుత కాలంలో పెరుగుతున్న బరువు, పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు ప్రధాన సమస్యలుగా మారాయి. అయితే ప్రతిరోజూ ఉదయం ఒక చెంచా కొబ్బరి తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనెలో ఉండే మీడియం-చైన్ ట్రిగ్లిజరైడ్స్ జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఉదయాన్నే పరగడుపున ఇలా కొబ్బరి నూనె తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇంతకీ కొబ్బరి నూనెను ఎలా వాడాలి..? ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం..

కాఫీ విత్‌ కొబ్బరి నూనె ట్రై చేసి చూడండి.. నెలరోజుల్లోనే మీ నడుం మల్లెతీగలా అవ్వాల్సిందే..!
How To Reduce Belly Fat
Jyothi Gadda
|

Updated on: Aug 25, 2026 | 1:58 PM

Share

నేటి ఆధునిక జీవనశైలి, అసమతుల్య ఆహార నియమాలు, వ్యాయామం లేకపోవడం వల్ల చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు, స్థూలకాయం. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గడమే కాకుండా పలు ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే, సహజ సిద్ధమైన పద్ధతిలో బరువు తగ్గడానికి మన ఇంట్లో అందుబాటులో ఉండే కొబ్బరి నూనె ఒక అద్భుతమైన నివారణగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

కాఫీ, కొబ్బరి నూనె కాంబినేషన్ ఎలా పనిచేస్తుంది?:

సాధారణంగా చాలామంది ఉదయాన్నే కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఒక కప్పు వేడి కాఫీలో ఒక చెంచా స్వచ్ఛమైన కొబ్బరి నూనె కలిపి పరగడుపున తాగడం వల్ల బరువు వేగంగా తగ్గే అవకాశం ఉంది.

జీవక్రియ మెరుగుపడుతుంది: కొబ్బరి నూనెలో ఆరోగ్యకరమైన శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, మీడియం-చైన్ ట్రిగ్లిజరైడ్స్ సమృద్ధిగా ఉంటాయి. కాఫీలోని కెఫిన్, కొబ్బరి నూనెలోని పోషకాలు కలిసి శరీరంలో జీవక్రియ రేటును గణనీయంగా పెంచుతాయి.

కెటోసిస్ ప్రక్రియ పెరుగుతుంది: ఈ మిశ్రమం శరీరంలో కెటోసిస్, ప్రక్రియను ప్రేరేపిస్తుంది. దీని వల్ల శరీరం కొవ్వును శక్తిగా మార్చుకుని, వేగంగా కేలరీలను కరిగిస్తుంది.

ఆకలిని నియంత్రిస్తుంది: కొబ్బరి నూనె సహజ సిద్ధమైన ఆకలి నివారిణిగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఈ కాఫీని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల ఊరికే ఆహారం తినాలనే కోరిక తగ్గడమే కాకుండా, శరీరంలోకి అదనపు కేలరీలు చేరకుండా ఉంటాయి.

వాపును తగ్గిస్తుంది: కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గించి, కొవ్వు చేరకుండా నిరోధిస్తాయి.

ఎలా తీసుకోవాలి?:

ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక కప్పు కాఫీలో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి తాగాలి. క్రమం తప్పకుండా ఈ అలవాటును పాటిస్తే పొట్ట చుట్టూ ఉన్న మొండి కొవ్వు తగ్గి, శరీరం తేలికగా మారుతుంది.

ముఖ్య గమనిక: అయితే, ఇది కేవలం సాధారణ సమాచారం, గృహ చిట్కాల ఆధారంగా అందించబడింది. మీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకున్నా లేదా ఈ చిట్కా పాటించే ముందు ఒకసారి వైద్యుడిని లేదా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us