AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు.. కేంద్రం కొత్త నిబంధనలు!

LPG Gas Cylinder: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణ కారణంగా మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉంది. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనివల్ల హోర్ముజ్ మీదుగా మధ్యప్రాచ్యం నుండి ఆసియాకు చమురు, గ్యాస్‌ను రవాణా..

LPG: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు.. కేంద్రం కొత్త నిబంధనలు!
Lpg Gas
Subhash Goud
|

Updated on: Aug 24, 2026 | 8:22 AM

Share

LPG Gas Cylinder: దేశంలో వంటగ్యాస్ అంటే ఎల్‌పిజి సిలిండర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌పిజి సిలిండర్లకు బదులుగా పైప్‌లైన్ సహజ వాయువు (పిఎన్‌జి) వాడకాన్ని వేగవంతంగా ప్రోత్సహించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఎల్‌పిజిపై ఆధారపడటాన్ని తగ్గించి, గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత సురక్షితంగా, డిజిటల్‌గా మార్చడమే దీని లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా..?

పీఎన్‌జీ కనెక్షన్ అందుబాటులో ఉన్న ప్రాంతాలలో కూడా పౌరులు ఎల్‌పిజి గ్యాస్‌ను వాడుతున్నట్లయితే, వారి ఎల్‌పిజి కనెక్షన్‌ను రద్దు చేయవచ్చని కేంద్రం జారీ చేసిన ఆదేశాలలో తెలియజేసింది. దీని కారణంగా, సంబంధిత వినియోగదారులు గ్యాస్ వాడకం విషయంలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ ఆదేశాలను కొత్త ఎల్‌పిజి నియంత్రణ ఉత్తర్వు 2026, ‘సహజ వాయు పంపిణీ ఉత్తర్వు 2026’ కింద జారీ చేసినట్లు తెలిపింది. ఈ ఆదేశాల ప్రకారం, ఒకే సమయంలో పీఎన్‌జీ, ఎల్‌పిజి కనెక్షన్లు రెండూ కలిగి ఉండటం నిషేధించారు. అందువల్ల అటువంటి వినియోగదారులు తమ ఎల్‌పిజి సిలిండర్ కనెక్షన్‌ను తిరిగి అప్పగించవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

PNG కనెక్షన్ తీసుకోవాలా?

రాష్ట్రాలకు రాసిన లేఖలో పెట్రోలియం కార్యదర్శి నీరజ్ మిట్టల్, ఎల్‌పిజి నుండి పిఎన్‌జికి మారే నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలిపారు. పిఎన్‌జి నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న సొసైటీలు లేదా ప్రాంతాల్లోని వినియోగదారులకు నోటీసులు జారీ చేస్తారు. నోటీసు అందుకున్న తర్వాత కూడా సంబంధిత వినియోగదారుడు నిర్దిష్ట కాలంలోగా పిఎన్‌జి కనెక్షన్ తీసుకోకపోతే, అతని ఎల్‌పిజి సిలిండర్ కనెక్షన్ స్వయంచాలకంగా రద్దు చేయవచ్చు.

మధ్యప్రాచ్యంలోని సంక్షోభం ప్రభావం:

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణ కారణంగా మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉంది. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనివల్ల హోర్ముజ్ మీదుగా మధ్యప్రాచ్యం నుండి ఆసియాకు చమురు, గ్యాస్‌ను రవాణా చేసే నౌకలపై ప్రభావం పడుతోంది. ఇది గ్యాస్ సరఫరాపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల, ఎల్‌పిజిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారతదేశం ఇప్పుడు పిఎన్‌జి వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

ఇది కూడా చదవండి: Personal Finance: చిన్న పొదుపు పెద్ద లాభం.. ప్రతి నెలా రూ. 5000 ఇన్వెస్ట్‌తో పదేళ్లలో ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా..?

ఇది కూడా చదవండి: Antilia: అంబానీ ఇంట్లో ఏసీలు ఎందుకు ఉండవు..? భారీ భుకంపాలను ఎలా తట్టుకుంటుంది? ఇంటి సీక్రెట్స్ ఏంటో తెలిస్తే షాకవుతారు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us