Antilia: అంబానీ ఇంట్లో ఏసీలు ఎందుకు ఉండవు..? భారీ భుకంపాలను ఎలా తట్టుకుంటుంది? ఇంటి సీక్రెట్స్ ఏంటో తెలిస్తే షాకవుతారు..!
Ambani's House Antilia: యాంటిలియాలో 160 కార్లను పార్క్ చేయగల సామర్థ్యం ఉంది. ఇది అసాధారణమైనది. ఇంటి లోపల ప్రత్యేక IMAX థియేటర్, ముత్యాలతో అలంకరించిన గోడలు, డైమండ్స్ పొదగబడిన రూఫ్‌టాప్‌లు ఉన్నాయి. ఇవి విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ఇంటిని డిజైన్ చేయడానికి అమెరికాకు..

Antilia: ముఖేష్ అంబానీ విలాసవంతమైన నివాసం యాంటిలియా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత అధునాతన భవనాలలో ఒకటిగా నిలుస్తుంది. దాదాపు 17,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఇల్లు కేవలం సంపదకు చిహ్నం మాత్రమే కాదు, ఇంజనీరింగ్, డిజైన్ అద్భుతాలకు నిదర్శనం. దీని పేరు అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక పౌరాణిక ద్వీపం నుండి ప్రేరణ పొందింది. ఇది భూలోక స్వర్గం లాగా అన్ని సౌకర్యాలను కలిగి ఉంటుంది.
యాంటిలియాలో 160 కార్లను పార్క్ చేయగల సామర్థ్యం ఉంది. ఇది అసాధారణమైనది. ఇంటి లోపల ప్రత్యేక IMAX థియేటర్, ముత్యాలతో అలంకరించిన గోడలు, డైమండ్స్ పొదగబడిన రూఫ్‌టాప్‌లు ఉన్నాయి. ఇవి విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ఇంటిని డిజైన్ చేయడానికి అమెరికాకు చెందిన పెర్కిన్స్ అండ్ విల్, హిర్ష్ బెండర్ అసోసియేట్స్ వంటి ప్రముఖ ఆర్కిటెక్చరల్ సంస్థలు పనిచేశాయి. ఈ డిజైన్ కమలం సూర్యుడి నుండి ప్రేరణ పొందింది. ముఖేశ్ అంబానీ వాస్తును కూడా పరిగణనలోకి తీసుకొని ఈ భవనాన్ని 100% హిందూ వాస్తు ప్రకారం నిర్మించారు.
యాంటిలియాలో ఏసీలు లేవు.. ఎందుకు?
ఆంటిలియాలో ఏసీలే లేవు అనేది కేవలం అపోహ మాత్రమే అయినప్పటికీ.. ఈ భవనం అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి దాని క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. యాంటిలియాలో సంప్రదాయ ఎయిర్ కండిషనర్లు లేవు. అక్కడ సాధారణ ఇళ్లలో ఉండేలా విడివిడిగా గోడలకు బిగించే ఏసీలు లేదా అవుట్‌డోర్ యూనిట్లు (Compressors) ఉండవు. బదులుగా, సెంట్రలైజ్డ్ ఆటో-అడ్జస్టింగ్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మొత్తం భవనంలో ఉష్ణోగ్రత, తేమను నియంత్రిస్తుంది. ఈ అధునాతన హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (HVAC) మెకానిజం గాలిని శుద్ధి చేసి, అన్ని గదులలో స్థిరమైన గాలి నాణ్యతను నిర్వహిస్తుంది. ఈ వ్యవస్థ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) ద్వారా నియంత్రిస్తుంది. ఇది భవనంలోని సెన్సార్ల ద్వారా ఉష్ణోగ్రత, జనం సాంద్రతను గ్రహించి, ఆటోమేటిక్‌గా వాతావరణాన్ని సర్దుబాటు చేస్తుంది.

Antilia
ఇది అధిక సౌకర్యాన్ని అందిస్తూనే శక్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఈ భవనంలో అమర్చిన ఖరీదైన ఇటాలియన్ మార్బుల్స్, అరుదైన ఇండోర్ మొక్కలు, పూల అలంకరణలు పాడవకుండా ఉండేందుకు ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా నియంత్రించే సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ప్రత్యేకించి మ్యాన్యువల్‌గా ఉష్ణోగ్రతను తగ్గించడం లేదా పెంచడం కుదరదు. ఇంటి లోపలి వాతావరణం, మొక్కల అవసరాలకు తగినట్లుగా సిస్టమ్ స్వయంగా ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. భవనం అందం దెబ్బతినకుండా ఉండేందుకే ఇలాంటి డిజైన్ ఎంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Jio: నెలకు రూ.103తో 336 రోజుల వ్యాలిడిటీ.. అపరిమిత వాయిస్ కాల్స్.. డేటా!
యాంటిలియాను 8 రిక్టర్ స్కేలు వరకు భూకంపాలను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. దీని నిర్మాణంలో W-ఆకారంలో ఉన్న అడ్వాన్స్‌డ్ ఫ్రేమింగ్ బీమ్‌లు, రీఇన్‌ఫోర్స్డ్ కాంక్రీట్ ఉపయోగించారు. ఈ బీమ్‌లు భూకంపాల ద్వారా ఉత్పన్నమయ్యే వైబ్రేషన్‌లను భవనం అంతటా పంపిణీ చేసి, నిర్మాణాన్ని స్థిరంగా ఉంచుతాయి. అదనంగా భవనం బేస్‌మెంట్‌లో ఫ్లెక్సిబుల్ జాయింట్‌లు, డంపింగ్ సిస్టమ్‌లు అమర్చారు. ఇవి పెద్ద భూకంపాల సమయంలో భవనం ఊగిసలాడకుండా స్థిరంగా ఉండేలా చూస్తాయి. ముంబైలో భూకంపాలు సంభవించినా, చుట్టుపక్కల భవనాలు ప్రభావితమైనా, యాంటిలియా మాత్రం చెక్కుచెదరదని దీని రూపకల్పన సూచిస్తుంది.

Antilia
యాంటిలియా మొత్తం ఎత్తు 173 మీటర్లు (568 అడుగులు). బయట నుంచి చూసినప్పుడు 27 అంతస్తులు కనిపించినప్పటికీ, ఒక్కో అంతస్తు ఎత్తు సాధారణ భవనాల అంతస్తుల కంటే చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది సుమారు 60 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తును కలిగి ఉంటుంది. ఈ ఇంటి నిర్మాణ విశేషాలు, సాంకేతికతలు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: రైతు మరణానంతరం భూమి ఎవరికి చెందుతుందా? పీఎం కిసాన్ డబ్బు ఎవరికి దక్కుతాయి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




