AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Painting Costs: సింగిల్, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి పెయింట్ కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

Home Painting Costs: చాలా మంది పెయింటర్లు తక్కువ ధరలకు పని చేయడానికి ముందుకు వచ్చి సగంలోనే పనిని వదిలేసి వెళ్ళిపోతుంటారు. దీనికి ప్రధాన కారణం వారు మొదట తక్కువ ధర చెప్పి, ఆ డబ్బులు అయిపోగానే మిగతా పనికి కావాల్సిన డబ్బులు..

Home Painting Costs: సింగిల్, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి పెయింట్ కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
Home Painting Costs
Subhash Goud
|

Updated on: Aug 22, 2026 | 6:00 AM

Share

Home Painting Costs: ఇంటికి రంగులు వేయించడం అనేది కేవలం అందం కోసమే కాదు, గోడల రక్షణకు కూడా చాలా అవసరం. అయితే, ఈ ప్రక్రియలో సరైన ప్లానింగ్ లేకపోతే అంచనాలకు మించి ఖర్చు అవ్వడం లేదా నాణ్యత లేని పని జరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మస్తాన్ అనే మేస్త్రి ఇంటి పెయింట్ వర్క్‌కు సంబంధించిన అన్ని వివరాలను, ఖర్చులను, ముఖ్యమైన చిట్కాలను అందిస్తున్నారు.

వర్క్ కాంట్రాక్టు, మేస్త్రి ఎంపిక:

చాలా మంది పెయింటర్లు తక్కువ ధరలకు పని చేయడానికి ముందుకు వచ్చి సగంలోనే పనిని వదిలేసి వెళ్ళిపోతుంటారు. దీనికి ప్రధాన కారణం వారు మొదట తక్కువ ధర చెప్పి, ఆ డబ్బులు అయిపోగానే మిగతా పనికి కావాల్సిన డబ్బులు ఉండక లేదా సరైన లాభం లేక పనిని ఆపేస్తారు. ఇది యజమానులకు అదనపు ఖర్చు, ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్ల ముందుగానే పూర్తి బడ్జెట్‌ను అంచనా వేసి, నమ్మకమైన, అనుభవజ్ఞుడైన మేస్త్రికి మొత్తం కాంట్రాక్టు ఇవ్వడం ఉత్తమం. లక్ష రూపాయల పనికి రూ.40,000 వంటి తక్కువ ధరలకు ఒప్పుకోవడం వల్ల నాణ్యతతో రాజీ పడాల్సి వస్తుందంటున్నారు మేస్త్రీలు. అయితే ఇక్కడ పెయింటింగ్‌కు సంబంధించిన ఖర్చుల వివరాలను వివరిస్తున్నాము. ఈ ధరలు సుమారుగా మాత్రమే. మేస్త్రీలు, బిల్డర్స్‌ అందించిన సమాచారం ఆధారంగా ఇందులో అందిస్తున్నాము. ఇంకో విషయం ఏటంటే ఇందులోని ఖర్చులు మీ ప్రాంతం బట్టి పెరగవచ్చు.. తగ్గవచ్చు.

ఇది కూడా చదవండి: House Construction: ఇంటి నిర్మాణంలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏదో తెలుసా..? ఇది ఇల్లు బలానికే పెద్ద దెబ్బ..!

ఇవి కూడా చదవండి

లేబర్, మెటీరియల్ ఖర్చులు:

పెయింట్ వర్క్ ఖర్చులను అంచనా వేసేటప్పుడు, లేబర్, మెటీరియల్ ఖర్చులను విడివిడిగా పరిగణించాలి.

  • సింగిల్ బెడ్‌రూమ్ హౌస్ (హాల్, కిచెన్): లేబర్ ఖర్చు సుమారు రూ.60,000.
  • డబుల్ బెడ్‌రూమ్ హౌస్ (హాల్, కిచెన్): లేబర్ ఖర్చు సుమారు రూ.75,000 నుండి రూ.80,000. ఇది పూర్తి పుట్టీ పనితో సహా

స్క్వేర్ ఫీట్ వారీగా ఖర్చులు:

  • పుట్టీతో కూడిన పెయింట్ వర్క్ (కేవలం లేబర్): రూ.20 పర్ స్క్వేర్ ఫీట్. ఇందులో రెండు కోట్లు వాల్ కేర్, లక్కింగ్, పేపర్ కొట్టడం, ఒక కోటు ప్రైమర్, రెండు కోట్లు కలర్ ఉంటాయి.
  • పుట్టీతో కూడిన పెయింట్ వర్క్ (లేబర్ + మెటీరియల్): మీడియం క్వాలిటీ మెటీరియల్: రూ.35 పర్ స్క్వేర్ ఫీట్.
  • ప్రీమియం క్వాలిటీ మెటీరియల్: ₹45 పర్ స్క్వేర్ ఫీట్.

పుట్టీ ఎంపిక, వినియోగం:

పుట్టీ ఇంటి గోడలకు నునుపైన, మన్నికైన ఉపరితలాన్ని అందిస్తుంది.

  • బ్రాండ్లు: బిర్లా వైట్, జె.కె., బెర్గర్ బైసన్, ఏషియన్ వంటి బ్రాండ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. బిర్లా వైట్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
  • * వాటర్ ప్రూఫ్ పుట్టీ: బెర్గర్ బైసన్‌లో వాటర్ ప్రూఫ్ పుట్టీ కూడా ఉంది. ఇది గోడలకు తేమ సమస్యలు ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. తేమను బయటికి రానీయదు.

ఇంటీరియర్ vs. ఎక్స్టీరియర్:

  • అవుట్ డోర్: బయటి గోడలకు వాటర్ ప్రూఫ్ పుట్టీ లేదా బిర్లా వైట్ యూస్ చేయడం వల్ల వర్షం, తేమ నుండి రక్షణ ఉంటుంది.
  • ఇన్ డోర్: లోపలి గోడలకు బైసన్ (వాటర్ ప్రూఫ్ వెర్షన్ కూడా), జె.కె. వంటివి వాడుకోవచ్చు.

ప్రైమర్ ప్రాముఖ్యత:

ప్రైమర్ అనేది పెయింట్ వర్క్‌లో కీలకమైన భాగం.

  • ఎప్పుడు వేయాలి: కొత్త గోడలపై పుట్టీ వేయడానికి ముందు లేదా పుట్టీ వేసిన తర్వాత వేయవచ్చు.
  • తేమ ఉన్న గోడలు: గోడలకు తేమ ఉన్నట్లయితే, ముందుగా బేస్ ప్రైమర్ వేయడం తప్పనిసరి.
  • పుట్టీ తర్వాత: పుట్టీ వేసి, పేపర్ కొట్టిన తర్వాత ప్రైమర్ వేయడం వల్ల పెయింట్ గోడకు బాగా పట్టుకుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది.

పెయింట్ల రకాలు, బ్రాండ్లు:

మీ అభిరుచికి, బడ్జెట్‌కు తగ్గట్టుగా పెయింట్ బ్రాండ్‌ను ఎంచుకోవచ్చు. ఏషియన్, బెర్గర్, మెడల్లా, ఫెవిలిట్, హై-షా పెయింట్స్ వంటి అనేక బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఇంటి లోపలి, బయటి భాగాలకు ఒకే బ్రాండ్‌ను వాడటం మంచిది.

ఇంటీరియర్ పెయింట్స్:

  • పుట్టీ వేసిన గోడలకు సిల్క్, సిల్క్ గ్లామర్ వంటివి మంచి షైనింగ్, ఫినిషింగ్ ఇస్తాయి. ఇవి ఎక్కువ మన్నిక కలిగి ఉంటాయి. మరకలు పడితే సర్ఫ్ వాటర్‌తో శుభ్రం చేసుకోవచ్చు.
  • ఏషియన్ పెయింట్స్‌లో “రాయల్ లగ్జరీ ఎమర్షన్” అనేది పుట్టీ వేసిన గోడలకు ఉత్తమ ఎంపిక. ఇది ఎక్కువ మన్నిక, షైనింగ్ ఇస్తుంది.

ఎక్స్టీరియర్ పెయింట్స్:

  • ఎపెక్స్: మధ్యతరగతి వారికి మంచి ఎంపిక. ఇది ఐదేళ్ల వరకు మన్నికను ఇస్తుంది.
  • అల్టిమా: ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే, అల్టిమా పదేళ్ల వరకు మన్నికను ఇస్తుంది. కలర్ డల్ అవ్వడం, వెలసిపోవడం వంటివి ఉండవు.
  • వాల్ మస్టా: తక్కువ ఖర్చులో కావాలంటే ఇది మూడు సంవత్సరాల వరకు పనిచేస్తుంది.
  • లాంగ్ లైఫ్, యాంటీ డస్ట్: ఇవి సుమారు ఏడేళ్ల వరకు పనిచేస్తాయి.

డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి మొత్తం ఖర్చు అంచనా

ఒక డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌కు (హాల్, కిచెన్‌తో సహా) పూర్తి పుట్టీ వర్క్‌తో పెయింట్ చేయిస్తే, లేబర్ ఖర్చు సుమారు రూ.75,000 నుండి రూ.80,000 వరకు అవుతుంది. ఎపెక్స్ వంటి మీడియం క్వాలిటీ మెటీరియల్స్ వాడితే, మెటీరియల్ ఖర్చు కూడా దాదాపు అంతే అవుతుంది. మొత్తం మీద రూ.1,40,000 నుండి రూ.1,60,000 వరకు ఖర్చవుతుంది. పుట్టీ వర్క్ లేకపోతే ఈ ఖర్చు దాదాపు సగం అవుతుంది.

  • కేస్ స్టడీ: ఒక డబుల్ స్టేర్ బిల్డింగ్ ఖర్చులు
  • లేబర్ కాస్ట్: రూ.1,42,000. ఇందులో లోపల పుట్టీ వర్క్, ఎలివేషన్‌కు స్ట్రక్చర్ వర్క్, రాయల్ ప్లే, హాల్ సీలింగ్ బోర్డర్‌లకు డిజైన్ వర్క్ ఉన్నాయి.
  • మెటీరియల్ కాస్ట్: ఓనర్ అన్ని బ్రాండెడ్ పెయింట్స్ వాడినందున, సుమారు రూ.1,60,000 వరకు ఖర్చయ్యింది. పుట్టీలు, స్ట్రక్చర్స్, పెయింట్స్ అన్నీ కాస్ట్లీ బ్రాండ్స్ వాడారు. సరైన ప్లానింగ్, నాణ్యమైన మెటీరియల్స్, అనుభవజ్ఞులైన మేస్త్రిని ఎంచుకోవడం ద్వారా ఇంటి పెయింట్ వర్క్‌ను విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: DMart: నష్టాలు పెరిగినా తగ్గని డి-మార్ట్.. వినియోగదారుల కోసం మరో సంచలన నిర్ణయం..!

ఇది కూడా చదవండి: PNB Bank Alert: వీరి అకౌంట్లను క్లోజ్‌ చేసేస్తాం.. పీఐబీ ఖాతాదారులకు హెచ్చరిక..!

ఇది కూడా చదవండి: Hyderabad: తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు.. ఎవరు కొన్నారో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us