AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు.. ఎవరు కొన్నారో తెలుసా?

Hyderabad: తెలంగాణలో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు పలుకుతుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఎకరం భూమి ఏకంగా 264 కోట్లు పలికింది. దీంతో ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంత ధర పలుకడం ఇది రికార్డు..

Hyderabad: తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు.. ఎవరు కొన్నారో తెలుసా?
Raidurgam Land Rate
Subhash Goud
|

Updated on: Aug 21, 2026 | 7:10 PM

Share

Hyderabad: తెలంగాణలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. హైదరాబాద్‌లోని రాయయదుర్గంలో ఎకరం భూము ధర వింటే మీరే షాకవుతారు. అక్షరాల 264 కోట్ల రూపాయలు. ఇప్పుడు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరోసారి భూముల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ (TGIIC) నిర్వహించిన భూముల ఆన్‌లైన్‌ వేలంలో రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ మేరకు TGIIC ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన భూముల వేలంలో ఇది మరో రికార్డుగా నిలిచింది. టీజీఐఐసీ భూముల వేలానికి భారీ స్పందన లభించింది. టీజీ ఐఐసీలో ఎకరం భూమి ఇంత ధర పలకడం రికార్డు అనే చెప్పాలి.

రాయదుర్గంలోని సర్వే నంబర్‌ 83/1లో పాన్‌మక్తా ప్రాంతానికి చెందిన మొత్తం 5.25 ఎకరాల భూమిని TGIIC ఆన్‌లైన్‌ వేలానికి పెట్టింది. ఈ భూమికి ఎకరాకు కనీస ధరను రూ.175 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. వేలంలో పాల్గొనే బిడ్డర్లకు రూ.10 కోట్ల డిపాజిట్‌ మొత్తాన్ని నిర్దేశించారు. భారీ విలువ కలిగిన భూమి కావడంతో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు వేలంలో పోటీపడి బిడ్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎకరాకు రూ. 264 కోట్ల చొప్పున లెక్కగడితే ఈ స్థలం మొత్తం విలువ రూ. 1,386 కోట్లకు చేరింది.

ఇదే ప్రాంతంలో మూడు నెలల క్రితం నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.237 కోట్ల ధర పలికినట్లు సమాచారం. తాజాగా ఆ రికార్డును అధిగమిస్తూ రూ.264 కోట్ల ధర నమోదవడం హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలోని రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌కు సంకేతంగా మారింది.

ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న రాయదుర్గం, పాన్‌మక్తా ప్రాంతాల్లో వాణిజ్య, కార్యాలయ, మిశ్రమ వినియోగ అభివృద్ధికి భారీ డిమాండ్‌ ఉండటమే ఈ స్థాయి ధరలకు కారణంగా రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు భావిస్తున్నాయి. TGIIC భూముల వేలంలో నమోదైన తాజా రికార్డు ధరతో హైదరాబాద్‌ భూముల మార్కెట్‌లో మరోసారి చర్చ మొదలైంది.

ఈ భూమిని ఎవరు కొన్నారో తెలుసా..?

ఎకరం భూమి ఇంత ధర పలుకడం, దీనిని ఎవరు కొన్నారనేదానిపై చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ఈ అత్యంత విలువైన స్థలాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘MSN రియాల్టీస్’ పోటీపడి వేలంలో దక్కించుకుంది. నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంత డిమాండ్‌ ఉందో తెలిసిపోతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us