India vs Sri Lanka, Asian Games Semi-Final Highlights: భారత్ ఘన విజయం.. పాక్‌తో ఫైనల్ పోరుకు రెడీ
IND vs SL Asian Games Semi Final Highlights in Telugu: ఆసియా గేమ్స్ రెండో సెమీఫైనల్‌లో భారత్ అదరగొట్టింది. తొలుత 169 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా, ఆపై శ్రీలంక బ్యాటింగ్‌ను పూర్తిగా కుప్పకూల్చింది. కేవలం 9.5 ఓవర్లలోనే శ్రీలంక 45 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

IND vs SL Asian Games Semi Final Highlights in Telugu: ఆసియా గేమ్స్ రెండో సెమీఫైనల్‌లో భారత జట్టు (India) అద్భుత విజయం సాధించింది. శ్రీలంక (Sri Lanka)తో జరిగిన కీలక పోరులో 124 పరుగుల భారీ తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (Ishan Kishan) 46 బంతుల్లో 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడి బ్యాటింగ్ కారణంగా భారత స్కోరు 169కు చేరింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్లు వరుస వికెట్లు తీస్తూ లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. పరుగులు సాధించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఒత్తిడి పెంచారు. ఫలితంగా శ్రీలంక 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే తన మొత్తం వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ 124 పరుగుల భారీ ఆధిక్యంతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
170 పరుగుల లక్ష్యం ముందు శ్రీలంకకు మంచి ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ పూర్తయ్యేలోపే మూడు వికెట్లు కోల్పోయిన లంకపై భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఆ దశలోనే ఛేదన దిశ మారిపోయింది.
వికెట్లు వరుసగా పడటంతో శ్రీలంక బ్యాటర్లపై ఒత్తిడి మరింత పెరిగింది. స్కోరుబోర్డుపై పరుగులు వేగంగా చేరకపోవడంతో లక్ష్యాన్ని అందుకోవడం కష్టంగా మారింది. 9.5 ఓవర్ల వద్ద చివరి వికెట్ పడటంతో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.
తొలుత భారత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ 80 పరుగులతో ప్రధాన పాత్ర పోషించాడు. వాషింగ్టన్ సుందర్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 20 ఓవర్లలో 169/7 స్కోరు సాధించింది. చివరి ఓవర్‌లో 18 పరుగులు రావడం కూడా భారత స్కోరును పెంచింది.
ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అదే జోరును కొనసాగించిన భారత్, శ్రీలంకను 45 పరుగులకే పరిమితం చేసింది. 124 పరుగుల విజయంతో సెమీఫైనల్‌ను ముగించిన టీమిండియా ఇప్పుడు ఆసియా గేమ్స్ ఫైనల్‌లో స్వర్ణ పతకం కోసం పోరాడనుంది. శ్రీలంకకు మాత్రం ఈ ఓటమితో టైటిల్ రేసు ముగిసింది.
LIVE Cricket Score & Updates
-
భారత్ ఘన విజయం..
ఆసియా గేమ్స్ రెండో సెమీఫైనల్‌లో భారత్ అదరగొట్టింది. తొలుత 169 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా, ఆపై శ్రీలంక బ్యాటింగ్‌ను పూర్తిగా కుప్పకూల్చింది. కేవలం 9.5 ఓవర్లలోనే శ్రీలంక 45 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
-
8వ వికెట్ కోల్పోయిన లంక.. భారత్ విజయానికి మరో 2 వికెట్లు
8వ వికెట్ కోల్పోయిన లంక..
-
-
7వ వికెట్ కోల్పోయిన లంక..
శ్రీలంక జట్టు 6.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయింది.
-
6వ వికెట్ కోల్పోయిన లంక
శ్రీలంక టీం 4.5 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయింది.
-
5వ వికెట్ కోల్పోయిన లంక
శ్రీలంక జట్టు 3.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయింది. బుమ్రా 2, అక్షర్ 2 వికెట్లు పడగొట్టగా, ఒక రనౌట్ నమోదైంది.
-
-
4వ వికెట్ కోల్పోయిన లంక
శ్రీలంక 3.1 ఓవర్లలో 4వ వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లు దూకుడు పెంచడంతో లంక ఛేజింగ్‌లో చేతులు ఎత్తేసింది.
-
3వ వికెట్ కోల్పోయిన లంక..
2.1 ఓవర్లలోనే లంక 3 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లో బుమ్రా 2 వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ 2వ ఓవర్ తొలి బంతికే షాకిచ్చాడు. దీంతో ప్రస్తుతం లంక 3 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది.
-
తొలి ఓవర్‌లోనే షాకిచ్చిన బుమ్రా.. 2 వికెట్లు కోల్పోయిన లంక
తొలి ఓవర్‌లోనే బుమ్రా లంక టీంకు ఊహించని షాకిచ్చాడు. కేవలం 1 పరుగు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
-
హాఫ్ సెంచరీతో ఇషాన్ దూకుడు.. లంక టార్గెట్ 170
ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 80 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. దీంతో లంక ముందు 170 పరుగుల టార్గెట్ నిలిచింది.
-
7వ వికెట్ కోల్పోయిన భారత్..
శివం దుబే రూపంలో భారత జట్టు 18.5వ ఓవర్లో 5 వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 151 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నాడు.
-
33 బంతుల్లో ఇషాన్ హాఫ్ సెంచరీ
ఇషాన్ కిషన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత జట్టు తరపున కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
టీ20ల్లో భారత్ తరపున అత్యధిక హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్లు:
38 – విరాట్ కోహ్లీ
32 – రోహిత్ శర్మ
25 – సూర్యకుమార్ యాదవ్
22 – కెఎల్ రాహుల్
13 – ఇషాన్ కిషన్*
12 – అభిషేక్ శర్మ
-
తిలక్ వర్మ ఔట్..
తిలక్ వర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 15 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.
-
5వ వికెట్ కోల్పోయిన భారత్..
అక్షర్ పటేల్ రూపంలో భారత జట్టు 13.5 ఓవర్ వద్ద 5 వికెట్ కోల్పోయింది. దీంతో ప్రస్తుతం భారత్ 112 పరుగులు వద్ద నిలిచింది.
-
100 పరుగులు దాటిన స్కోర్..
భారత జట్టు 12.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఇషాన్, అక్షర్ క్రీజులో ఉన్నారు.
-
పెవిలియన్ చేరిన టీమిండియా కెప్టెన్
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరుకపోతోంది. 9.4 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి కేవలం 87 పరుగులు మాత్రమే చేసింది.
-
వైభవ్ సూర్యవంశీ ఔట్..
వైభవ్ సూర్యవంశీ 38 పరుగులు చేశాడు. 21 బంతుల్లో 2 సిక్స్‌లు, 6 ఫోర్లతో దూకుడు చూపించినా లంక బౌలర్ల ముందు తలవంచక తప్పలేదు.
-
ముగిసిన పవర్ ప్లే
పవర్ ప్లే ముగిసే సమయానికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది.
-
శాంసన్ ఔట్..
3వ ఓవర్ చివరి బంతికి టీమిండియా బిగ్ షాక్ తగిలింది. శాంసన్ 7 పరుగులు చేసిన పెవిలియన్ చేరాడు.
-
అభిషేక్ ఔట్..
అభిషేక్ శర్మ రూపంలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దీంతో 2 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 1 వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది.
-
వైభవ్ సూర్యవంశీకి చోటు..
భారత్ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా.
-
టాస్ గెలిచిన లంక..
భారత్, శ్రీలంకల మధ్య ఆసియా క్రీడల సెమీ-ఫైనల్ మొదలైంది. ఈ మ్యాచ్ జపాన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన లంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
-
తోపు ప్లేయర్‌గా ఇషాన్ కిషన్..
ఈ ఏడాది భారతదేశం తరపున ఇషాన్ కిషన్ అత్యధికంగా 905 పరుగులు సాధించాడు. అతను 27 మ్యాచ్‌లలో 171.07 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అతని అత్యధిక స్కోరు 103. అతను ప్రస్తుతం టీ20ఐ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు.
-
10 ఓవర్ల క్రికెట్ మాత్రమే..
2023 ఆసియా క్రీడల్లో టీమ్ ఇండియా స్వర్ణ పతకం గెలుచుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో, తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఈ జట్టు జపాన్‌కు చేరుకుంది. అయితే, అక్కడ ఇప్పటివరకు కేవలం 10 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ మాత్రమే ఆడింది.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పూర్తిని పురస్కరించుకుని జపాన్‌లో ఆతిథ్య జట్టుతో భారత్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ కూడా ఇరు జట్లకు కేవలం ఐదు ఓవర్లకే కుదించబడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆసియా క్రీడలలో భాగం కాదు.
-
33 సార్లు తలపడ్డ భారత్ – శ్రీలంక
- టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 33 సార్లు తలపడ్డ భారత్ – శ్రీలంక
- భారత్ 21 మ్యాచ్‌లు, శ్రీలంక 9 మ్యాచ్‌లలో గెలుపు
- 2మ్యాచ్‌లు డ్రాగా ముగియగా, ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
-
కాసేపట్లో సెమీ ఫైనల్
- ఆసియా క్రీడల్లో ఇవాళ భారత్ – శ్రీలంక సెమీ ఫైనల్ మ్యాచ్..
- ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- మెరుగైన టీ20 ర్యాంకింగ్‌ల ఆధారంగా సెమీస్ చేరిన ఇరు జట్లు
- ఇవాళ వర్షం పడే అవకాశం దాదాపు లేదు.
Published On - Oct 01,2026 7:50 AM




