AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాంచింగ్ కు ముందే సంచలనం సృష్టిస్తున్న హువావే మేట్ 90! కలర్ గురించి తెలిస్తే

హువావే మేట్ 90 సిరీస్ కోసం స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ల లాంచ్ తేదీకి సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. హువావే చైనా అధికారిక వెబ్‌సైట్‌లో పొరపాటున లాంచ్ పేజీ కనిపించింది. కొద్దిసేపటికే దాన్ని తొలగించినా, అందులోని పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కొత్త ఫోన్ల డిజైన్‌పై ఆసక్తి పెరిగింది.

లాంచింగ్ కు ముందే సంచలనం సృష్టిస్తున్న హువావే మేట్ 90! కలర్ గురించి తెలిస్తే
Huawei Mate 90 Series.jpg
Nikhil
|

Updated on: Oct 01, 2026 | 7:51 AM

Share

కొత్త ఫోన్‌కు సంబంధించిన సమాచారం అధికారికంగా బయటకు రాకముందే లీక్ అయితే ఆ ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇప్పుడు హువావే మేట్ 90 విషయంలోనూ ఇదే జరిగింది. లాంచ్ పోస్టర్‌తో పాటు ఫోన్ లైవ్ ఫోటోలు కూడా నెట్‌లో కనిపించాయి. గ్రీన్ కలర్, పెద్ద గుండ్రటి కెమెరా మాడ్యూల్‌తో కనిపిస్తున్న ఈ ఫోన్ డిజైన్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

కొత్త గ్రీన్ కలర్‌తో

హువావే చైనా వెబ్‌సైట్‌లో పొరపాటున కనిపించిన పోస్టర్ ప్రకారం మేట్ 90 సిరీస్ ఫోన్లు అక్టోబర్ 1వ తేదీన విడుదల కానున్నాయి. అధికారికంగా వెల్లడించాల్సిన సమాచారం ముందుగానే బయటకు రావడంతో కంపెనీ ఆ పేజీని తొలగించింది. అయితే అప్పటికే పోస్టర్ సోషల్ మీడియాలోకి చేరిపోయింది.

పోస్టర్‌లో కనిపిస్తున్న అర్ధచంద్రాకార రింగ్ డిజైన్ ఫోన్ వెనుక భాగంలో పెద్ద గుండ్రటి కెమెరా మాడ్యూల్ ఉండొచ్చనే సంకేతాలను ఇస్తోంది. ఈసారి సరికొత్త గ్రీన్ కలర్ వేరియంట్‌ను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ రంగు ఫోన్‌కు ప్రీమియమ్ లుక్ అందిస్తోంది.

కెమెరాపైనే ఫోకస్

పోస్టర్ లీక్ అయిన కొద్దిసేపటికే మేట్ 90కు సంబంధించిన లైవ్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇందులో బ్రైట్ గ్రీన్ కలర్ మోడల్ కనిపించింది. వెనుక ప్యానెల్‌ను రెండు భాగాలుగా రూపొందించారు. పైభాగంలో నిలువు, అడ్డ గీతలతో లేత అల్లికలా కనిపించే డిజైన్ ఇచ్చారు. కాంతి పడినప్పుడు ఇది విభిన్న షేడ్స్‌లో మెరుస్తుంది. కింది భాగం సాదాగా ఉండటంతో పాటు మెటాలిక్ హువావే లోగో కనిపిస్తోంది.

వెనుక వైపు పెద్ద గుండ్రటి కెమెరా మాడ్యూల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. చుట్టూ మెరిసే అంచు ఉండగా, లోపల మూడు కెమెరా లెన్స్‌లు కనిపిస్తున్నాయి. మధ్యలో హువావే సొంత XMAGE బ్రాండింగ్ ఉంది. కెమెరా పైన గజర్ ఆటోఫోకస్ సెన్సార్, కింద ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌ను అమర్చినట్లు లీకైన ఫోటోలు సూచిస్తున్నాయి. సైడ్ ఫ్రేమ్‌కు గోల్డ్ ఫినిషింగ్ ఇవ్వడంతో ఫోన్‌కు లగ్జరీ లుక్ వచ్చింది.

గ్రీన్ మోడల్‌తో పాటు మేట్ 90 ఆర్‌ఎస్ అల్టిమేట్ మోడల్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇది రెడ్ సెరామిక్ బ్యాక్ ప్యానెల్‌తో డ్యూయల్ టోన్ డిజైన్‌లో కనిపిస్తోంది. సిరీస్‌లో పలు మోడల్స్ రానున్నట్లు సమాచారం. కెమెరా విభాగంలోనూ మార్పులు ఉండొచ్చని, కొత్త టెలిఫోటో యాక్సెసరీ సాంకేతికతతో ఫోటోగ్రఫీ సామర్థ్యాలను మెరుగుపరచనున్నట్లు తెలుస్తోంది.

Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?