ప్రాణాలను పణంగా పెట్టి 174 మందిని కాపాడిన భారత పైలట్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు!
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్ చేతిలో కత్తిపోటుకు గురైన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని అదుపులో ఉంచుతూ విమానంలోని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు కీలకంగా వ్యవహరించారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. గురువారం (అక్టోబర్ 01) ఉదయం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్న ప్రధాని.. కెప్టెన్ స్మిత్ మచార్‌ను హీరోగా అభివర్ణించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో తీవ్రంగా గాయపడినా, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం, అచంచలమైన సంకల్పం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆయన శౌర్యం వందలాది ప్రాణాలను కాపాడి, పెద్ద విషాదాన్ని నివారించిందని అన్నారు. కెప్టెన్ మచార్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
Captain Smit Machchhar is a HERO.
In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others.
His valour helped save hundreds of lives and avert a great tragedy.
India is proud of Captain Machchhar.
Praying for his speedy recovery, renewed strength and good health.
— Narendra Modi (@narendramodi) October 1, 2026
అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా కెప్టెన్ మచార్ సాహసాన్ని ప్రశంసించారు. కత్తిపోటుకు గురై తీవ్రంగా గాయపడినప్పటికీ దాడి చేసిన వ్యక్తిని ప్రతిఘటించి, కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు సహకరించారని తెలిపారు. అనంతరం ప్రయాణికులు, సిబ్బంది కలిసి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో గగనతలంలో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనలో 174 మంది ప్రాణాలను కాపాడిన కెప్టెన్ మచార్ నిజమైన హీరో అని కొనియాడారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..