September 28, 2026
Subhash
ప్రతిచోటా QR కోడ్ ద్వారా పేమెంట్లు చేస్తున్నారు. PhonePe, Google Pay వంటి UPI యాప్స్‌తో సెకన్లలో డబ్బులు పంపొచ్చు. కానీ మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది.
సైబర్ నేరగాళ్లు నకిలీ QR కోడ్‌లను ఉపయోగించి డబ్బులను తమ ఖాతాలకు మళ్లించే ప్రయత్నం చేయవచ్చు. ఏ QR కోడ్ కనిపించినా స్కాన్ చేయకుండా అది ఎవరిదో చెక్ చేయాలి?
కోడ్ స్కాన్ చేశాక పేమెంట్ స్క్రీన్‌పై కనిపించే దుకాణం పేరు, వ్యక్తి పేరు లేదా UPI IDని జాగ్రత్తగా పరిశీలించండి. తప్పుగా ఉంటే పంపకండి.
QR కోడ్‌ను మోసగాళ్లు మార్చి, దాని మీద మరో నకిలీ QR స్టిక్కర్ పెట్టే అవకాశం ఉంది. QR కోడ్ అసలు దుకాణానిదేనా? దాని మీద ఏదైనా స్టిక్కర్ అతికించారా? గమనించాలి.
ఎవరైనా డబ్బులు మీకు వస్తాయి.. ఈ QR కోడ్ స్కాన్ చేయండి అని చెబితే జాగ్రత్త. QR కోడ్ స్కాన్ చేసి UPI PIN నమోదు చేయాల్సిన అవసరం లేదు. UPI PIN సాధారణంగా పేమెంట్‌ను ఆథరైజ్ చేయడానికి ఉపయోగిస్తారు.
QR కోడ్ అనుమానాస్పదంగా కనిపిస్తే దాన్ని వెంటనే పేమెంట్ యాప్‌తో స్కాన్ చేయకుండా, Google Lens వంటి సాధనంతో ముందుగా పరిశీలించవచ్చు. వివరాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి.
దుకాణంలోని సౌండ్‌బాక్స్ నుంచి పేమెంట్ విజయవంతమైనట్లు వాయిస్ వచ్చినా, దానిపైనే పూర్తిగా ఆధారపడకండి. మీ UPI యాప్ లేదా బ్యాంక్ ఖాతాలో ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేయండి.
QR కోడ్ స్కాన్ చేసే ముందు పరిశీలించండి. Payee పేరు, UPI ID, మొత్తాన్ని చెక్ చేయండి. డబ్బులు పొందడానికి QR స్కాన్ చేయొద్దు. ఎవరికీ UPI PIN, OTP చెప్పొద్దు.