AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మద్యం దుకాణాలు బంద్.. ఆ రోజు పూర్తిగా క్లోజ్..

మందుబాబులకు చేదువార్త. అక్టోబర్ 2వ తేదీన మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మద్యం షాపులతో పాటు చికెన్, మటన్, బీఫ్ దుకాణాలు మూసివేయనున్నారు. దేశవ్యాప్తంగా డ్రైడే అమలు కానుంది. గాంధీ జయంతి కారణంగా మద్యం, చికెన్, మటన్,బీఫ్ షాపులు క్లోజ్ కానున్నాయి.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మద్యం దుకాణాలు బంద్.. ఆ రోజు పూర్తిగా క్లోజ్..
Shops
Venkatrao Lella
|

Updated on: Sep 30, 2026 | 9:15 PM

Share

మందుబాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్‌లో మద్యం దుకాణాలన్నీ అక్టోబర్ 2వ తేదీన బంద్ కానున్నాయి. గాంధీ జయంతిని పురస్కరించుకుని మద్యం షాపులను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు, క్లబ్‌లకు ఈ ఆదేశాలు వర్తింపచేస్తాయని ప్రకటించారు. ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని నగర పరిధిలోని పోలీస్ కమిషనర్లకు జీహెచ్‌ఎంసీ సూచించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. గాంధీ జయంతి సందర్భంగా ప్రతీ ఏడాది అక్టోబర్ 2న మద్యం దుకాణాలు బంద్ అవుతాయి. ఈ సారి కూడా అదే రూల్ పాటించాలని జీహెచ్‌ఎంసీ కోరింది.

మద్యం దుకాణాలు డ్రై డేగా పాటించాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. గాంధీజీ అహింసా సిద్ధాంతాలు, ఆయనను గౌరవిస్తూ మద్యం దుకాణాలు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ స్టాడింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు నగరవ్యాప్తంగా మద్యం అమ్మకాలు అక్టోబర్ 2వ తేదీన బంద్ కానున్నాయి. ఈ మార్గదర్శకాలను వ్యాపారులు, ప్రజలు పాటించాలని అధికారులు కోరారు. ఎవరైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే చట్టప్రకారం చర్లయు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు,వ్యాపారులు దీనికి సహకరించాలని కోరారు. అక్టోబర్ 2వ తేదీ వేకువజామున నుంచి అర్ధరాత్రి వరకు మద్యం షాపులు బంద్ అవుతాయి. తిరిగి అక్టోబర్ 3న ఉదయం తెరుచుకుంటాయి.

వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లలోని మద్యం సరఫరా, పబ్‌లు, స్టార్ హోటళ్లలో మద్యం సర్వ్ చేయడం, క్లబ్‌లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఇక కల్లు దుకాణాలు కూడా బంద్ కానున్నాయి. మద్యం విక్రయిస్తే ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అక్టోబర్ 2న మద్యం అమ్మకాలు బంద్ అవుతాయి. దేశవ్యాప్తంగా డ్రైడే అమల్లో ఉంటుంది. అటు చికెన్, మటన్, బీఫ్ దుకాణాలు కూడా బంద్ అవుతాయి. మేకలు, గొర్రెలు, పశువుల వధశాలలతో పాటు చికెన్, మటన్, చీఫ్ షాపులు అక్టోబర్ 2న పూర్తిగా మూతపడనున్నాయి.

Follow Us