AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడ్జెట్ లో అదిరిపోయే ఫోన్ కావాలంటే రెడ్ మీ 17 సి గురించి తెలుసుకోవాల్సిందే.. లేకుంటే నష్టపోతారు

బడ్జెట్‌లో 5G ఫోన్ కొనాలని చూస్తున్న వారికి షావోమీ మరో కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ‘Redmi 17C 5G’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో అక్టోబర్ 1న విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. ఇప్పటికే టీజర్ల ద్వారా ఫోన్ డిజైన్, రంగులపై స్పష్టత ఇచ్చింది. సింగపూర్‌లో ఇప్పటికే విడుదలైన ఈ మోడల్.. దాదాపు అవే ఫీచర్లతో భారత్‌లోకి రానుంది.

బడ్జెట్ లో అదిరిపోయే ఫోన్ కావాలంటే రెడ్ మీ 17 సి గురించి తెలుసుకోవాల్సిందే.. లేకుంటే నష్టపోతారు
Redmi 17c 5g.jpg
Nikhil
|

Updated on: Oct 01, 2026 | 7:54 AM

Share

తక్కువ ధరలో పెద్ద స్క్రీన్, 5G కనెక్టివిటీ, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి రెడ్‌మీ కొత్త ఫోన్ ఆసక్తికరంగా మారింది. 6.9 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్రౌన్, పర్పుల్, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

6.9 అంగుళాల డిస్‌ప్లే..

Redmi 17C 5Gలో 6.9 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రీఫ్రెష్ రేట్ ఉండటంతో సోషల్ మీడియా స్క్రోలింగ్, గేమింగ్ వంటి పనులు స్మూత్‌గా సాగుతాయి. బయట వెలుతురు ఎక్కువగా ఉన్న సమయంలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 810 నిట్స్ బ్రైట్‌నెస్ అందించారు. పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. రోజువారీ అవసరాలకు సరిపోయే పనితీరుతో పాటు 5G నెట్‌వర్క్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. బ్రౌన్, పర్పుల్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ రానుంది.

50MP కెమెరా..

ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా, దీనికి తోడుగా మరో కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ వాటర్‌డ్రాప్ నాచ్ కెమెరా ఇచ్చారు. ఫోన్‌లోని స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా పెంచుకునే అవకాశం కూడా ఉంది.

బ్యాటరీ విషయానికి వస్తే 6000mAh సామర్థ్యంతో రావడం మరో ప్రత్యేకత. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజువారీ అవసరాలకు ఎక్కువసేపు ఉపయోగించుకోవచ్చు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీని తక్కువ సమయంలోనే ఛార్జ్ చేసుకోవచ్చు. వీడియోలు చూడటం, ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉండే వారికి ఇది ఉపయోగపడుతుంది. భారత మార్కెట్లో అక్టోబర్ 1న అధికారికంగా విడుదల కానున్న ఈ ఫోన్ ధర, వేరియంట్లు, సేల్ ఆఫర్లను కంపెనీ అదే రోజు వెల్లడించనుంది. పెద్ద స్క్రీన్, 5G, భారీ బ్యాటరీని బడ్జెట్ ధరలో కోరుకునే వారికి ఈ మోడల్ ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారనుంది.

Follow Us