AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo WATCH GT 2 Launch: 25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్‌ !!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో భారత్ టెక్ మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ క్రమంలోనే కొత్తగా Vivo X500 సిరీస్ ఫోన్లతో పాటు టెక్‌ ప్రియులను ఆకట్టుకునేలా సరికొత్త Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియం లుక్‌, అదిరిపోయే హెల్త్ ఫీచర్లు, వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌తో అందర్నీ ఆకర్షిస్తోంది.

Vivo WATCH GT 2 Launch: 25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్‌ !!
Vivo Watch Gt 2
Korivi Jayakumar
|

Updated on: Nov 29, 2026 | 4:03 PM

Share

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో భారత్ టెక్ మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మారుతున్న కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ లతో మొబైల్స్, గ్యాడ్జెట్‌ లను రిలీజ్ చేస్తూ కస్టమర్లను పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే కొత్తగా Vivo X500 సిరీస్ ఫోన్లతో పాటు టెక్‌ ప్రియులను ఆకట్టుకునేలా సరికొత్త Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియం లుక్‌, అదిరిపోయే హెల్త్ ఫీచర్లు, వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు.. ఏకంగా 25 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ తో వస్తున్న ఈ వాచ్ ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది.

Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లు..

బ్యాటరీ బ్యాకప్..

ఈ వాచ్‌లో బెస్ట్ అంటే ముందుగా బ్యాటరీనే అని చెప్పాలి. కేవలం ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. బ్లూటూత్ కనెక్టివిటీతో గరిష్టంగా 25 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

హెల్త్‌, స్పోర్ట్స్‌..

ఫిట్‌నెస్ ప్రియుల కోసం ఇందులో ఏకంగా 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను లోడ్ చేశారు. ఇండోర్‌, అవుట్‌డోర్‌ వర్కవుట్లతో పాటు రన్నింగ్ చేసేవాళ్ల కోసం ప్రత్యేకమైన రన్నింగ్ కోర్సులు, ఫామ్‌ అనాలిసిస్ లాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. ఇక హార్ట్‌ రేట్‌, SpO₂ (బ్లడ్‌ ఆక్సిజన్‌) లెవెల్స్‌, శ్వాస తీరు, హార్ట్‌ రేట్‌ వేరియబిలిటీ (HRV) వివరాలను కూడా తెలుసుకోవచ్చని అంటున్నారు.

డిస్‌ప్లే..

ఈ కొత్త స్మార్ట్‌వాచ్‌లో 2.07 అంగుళాల (5.26 సెం.మీ) పెద్ద AMOLED డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 60Hz రిఫ్రెష్‌ రేట్‌తో పాటు ఏకంగా 2400 నిట్స్‌ లోకల్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎండలో బయటికి వెళ్లినా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు.

డిజైన్‌..

హై-గ్లోస్‌ బ్లాక్‌ అల్యూమినియం ఫినిషింగ్‌తో దీన్ని చాలా రిచ్‌గా డిజైన్ చేశారు. ఇక నీటిలో తడిచినా ఇబ్బంది లేకుండా 5ATM వాటర్‌ రెసిస్టెన్స్‌ ఇచ్చారు. మన మూడ్‌ను బట్టి మార్చుకోవడానికి క్లాసిక్‌, బోల్డ్‌, ఇంటరాక్టివ్‌, డైనమిక్‌ వాచ్‌ ఫేస్‌లు ఉన్నాయి. అలాగే స్ట్రాప్ మార్చడం కోసం ప్రత్యేకంగా ‘వన్‌ క్లిక్‌ స్ట్రాప్‌ రిలీజ్‌’ మెకానిజం తీసుకొచ్చారు.

కలర్స్..

అబ్సిడియన్‌ బ్లాక్‌, స్టెల్లార్‌ వైట్‌ కలర్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

సాఫ్ట్‌వేర్‌, స్మార్ట్‌ ఫీచర్లు..

ఈ స్మార్ట్ వాచ్ BlueOS 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకే కాకుండా ఐఫోన్ (iOS) యూజర్లకు కూడా సపోర్ట్ చేయడం గమనార్హం. అలానే ఫోన్‌ను ముట్టుకోకుండానే వాచ్‌ నుంచే స్క్రీన్‌ను కంట్రోల్ చేయడం, యాప్‌లలో స్క్రోల్ చేయడం వంటి రిమోట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఎన్‌క్రిప్ట్ చేయని 13.56MHz ఆఫీస్, బిల్డింగ్ యాక్సెస్ కార్డులను వాచ్‌లో సేవ్ చేసుకునేలా NFC యాక్సెస్ కార్డ్ ఆప్షన్ కూడా ఇచ్చారు.

ధర..

మన దేశంలో Vivo WATCH GT 2 ధరను రూ.14,999గా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలుకాగా.. డిసెంబర్ 3 నుంచి అధికారికంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

లభ్యత..

ఈ స్మార్ట్ వాచ్ వివో అధికారిక ఆన్‌లైన్ స్టోర్ (shop.vivo.com) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ విడిగా వేరే స్ట్రాప్స్ కావాలనుకుంటే.. గ్రీన్‌ స్పోర్ట్ బ్యాండ్‌ ధర రూ.1,999గా, బ్రౌన్‌ లెదర్‌ బ్యాండ్‌ ధర రూ.2,799గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ప్రత్యేక లాంచ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది.

Follow Us