AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హైదరాబాద్‌లో హిట్‌ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు!

హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. హైస్పీడ్‌తో దూసుకొచ్చిన ఓ కారు.. రోడ్డుపై నడుచకుంటూ వెళ్తున్న తొమ్మది మందిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులను హాస్పిటల్‌కు తరలించారు స్థానికులు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Viral Video: హైదరాబాద్‌లో హిట్‌ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు!
Kushaiguda Car Accident
Anand T
|

Updated on: Sep 30, 2026 | 9:38 PM

Share

హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఒక్కసారిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 9 మంది బాటసారులపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడగా.. గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత సదురు కారు డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు.

ఇక సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటాన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని కారు నడిపిన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us