AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.500కే గ్యాస్ సిలిండర్ కావాలా..? ఇలా చేస్తేనే మీకు అందుతుంది.. ప్రభుత్వం బిగ్ అనౌన్స్‌మెంట్..

Gas Cylinder: మహాలక్ష్మి గ్యాస్ పథకం కింద లబ్దిదారులుగా ఉన్నారా.. ? అయితే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ పేదలకు అందిస్తోంది. ఇక నుంచి ఈ సబ్సిడీ పొందాలంటే ప్రభుత్వం ఓ షరతు విధించింది.

రూ.500కే గ్యాస్ సిలిండర్ కావాలా..? ఇలా చేస్తేనే మీకు అందుతుంది.. ప్రభుత్వం బిగ్ అనౌన్స్‌మెంట్..
Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Nov 29, 2026 | 8:05 AM

Share

తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి గ్యాస్ పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్కీమ్ ప్రారంభించింది. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ది పొందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి వరకు ఉండగా.. ప్రభుత్వం కేవలం రూ.500కే ఇస్తోంది. దీంతో పేదలకు గ్యాస్ కోసం ఖర్చు చేసే డబ్బులు ఆదా అవుతున్నాయి. ఈ పథకం వల్ల తక్కువ ధరకే గ్యాస్ పొందగలుగుతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది.

ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి..

మహాలక్ష్మి గ్యాస్ పథకం లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఆథార్ అథెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది పూర్తి చేయడం తప్పనిసరి అని పేర్కొంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎల్పీజీ కనెక్షన్ వివరాలను అనుసంధానం చేయాలని కోరింది. ఆధార్ లేనివారు పాన్ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు ఉపయోగించి గుర్తింపు ధృవీకరణ పూర్తి చేయాలని తెలిపింది. ఆధార్ అధెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తేనే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందుతుందని స్పష్టం చేసింది. వేలిముద్రలు పడనివారు ఐరిస్, ఫేస్ స్కాన్, ఓటీపీ, క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లబ్దిదారులందరూ ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తెలిపింది. ఈ పథకంలో లబ్దిదారులు తొలుత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. ముందుగా పూర్తి నగదు చెల్లించి సిలిండర్ బుక్ చేసుకోవాలి. సిలిండర్ డెలివరీ అయిన తర్వాత లబ్దిదారుడి అకౌంట్లోకి రూ.500 జమ అవుతాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 42.90 లక్షల కుటుంబాలు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకంపై ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 91.49 లక్షల మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులన్నింటినీ పారదర్శకంగా, కచ్చితత్వంతో పరిశీలించిన అనంతరం తొలిదశలో 42.90 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. రాష్ట్రంలో 1.20 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ.. మహాలక్ష్మి పథకం ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకే వర్తింపచేస్తున్నారు. గతంలో కొన్ని కారణాల వల్ల అనేకమంది అర్హులైన కుటుంబాలు ఈ పథకానికి దూరమయ్యాయి. వివాహం చేసుకుని కొత్తగా కాపురం పెట్టిన జంటలకు వేరుగా రేషన్ కార్డులు లేకపోవడం, ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు నివసిస్తున్నా ఒకే రేషన్ కార్డు ఉండటం వంటి సమస్యల కారణంగా చాలామంది లబ్ధిదారులు పథకాన్ని పొందలేకపోయారు.

Follow Us