AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఇదే!

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఇదే!

Phani CH
|

Updated on: Sep 30, 2026 | 5:17 PM

Share

గత రెండు సెషన్లలో భారీగా తగ్గిన బంగారం ధరలు సెప్టెంబర్‌ 30న స్వల్పంగా కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ నెలవారీగా నష్టాల్లోనే ఉన్నాయి. అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్‌ కదలికలు, భౌగోళిక ఉద్రిక్తతలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో నగరం, స్వచ్ఛత, పన్నులు, మేకింగ్‌ ఛార్జీల ఆధారంగా తుది ధర మారవచ్చు. కొనుగోలుదారులు తాజా ధరను తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి.

గత రెండు రోజుల నుంచి కుప్పకూలిన బంగారం ధరలు ఈ రోజు కాస్త పెరిగాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో పెట్టుబడిదారులు విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు కాస్త ర్యాలీలోకి వచ్చాయి. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు గత రెండు రోజులుగా భారీగా పతనమైన సంగతి తెలిసిందే. సామాన్యులకు తగ్గుదల ఊరటనివ్వగా పెట్టుబడిదారులు మాత్రం భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. తాజాగా పసిడి ధరలు కాస్త పెరిగి ఇన్వెస్టర్లకు ఊపిరి పోశాయని చెప్పవచ్చు. సెప్టెంబర్ 30 ఉదయం కూడా అంతర్జాతీయ పసిడి ధరలు కనిష్ఠ స్థాయిల వద్దే కొనసాగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.770 పెరిగి, రూ. 1,49,570 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.700 పెరిగి, రూ.1,37,100 పలుకుతోంది. కేజీ రూ.2,40,000 తో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 30 బుధవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,940 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37,250 పలుకుతోంది. ముంబై,కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,570 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,100 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,49,570 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37,100 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,570, 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37,100 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.2,40,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌ చేసుకొని వెళితే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

FD Rules: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి ఎఫ్‌డీ నిబంధనల్లో మార్పులు

ఆ ఒక్క మార్పుతో రెచ్చిపోతోన్న కోహ్లీ.. కింగ్ బ్యాటింగ్ సీక్రెట్ చెప్పేసిన గిల్

ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన…సంస్థ ఇచ్చిన పరిహారం ఎంతో తెలుసా?

Asian Games 2026: ఏషియన్‌ క్రీడల్లో గుల్వీర్ సింగ్ మెరుపు.. 1500 మీటర్లలో రజతం కైవసం!

ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

Follow Us