AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Construction: ఇంటి నిర్మాణంలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏదో తెలుసా..? ఇది ఇల్లు బలానికే పెద్ద దెబ్బ..!

House Construction: కొత్త ఇంటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరి కల. అయితే చాలా మంది ఇంటి నిర్మాణంలో మొదటిగా చేసే పొరపాట్లు కొన్ని ఉంటాయి. ఆ పొరపాట్లే మీ ఇంటి బలానికి పెద్ద దెబ్బ అని ఇంటి నిర్మాణ నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా నిర్మాణం చేపట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదని సూచిస్తున్నారు..

House Construction: ఇంటి నిర్మాణంలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏదో తెలుసా..? ఇది ఇల్లు బలానికే పెద్ద దెబ్బ..!
House Construction Tips
Subhash Goud
|

Updated on: Aug 21, 2026 | 8:16 PM

Share

House Construction: ఇంటి నిర్మాణం లో అనేక అంశాలు ఉన్నప్పటికీ, దాని జీవితకాలాన్ని గణనీయంగా ప్రభావితం చేసే మొదటి, అతి ముఖ్యమైన పొరపాటు పునాది (ఫుట్టింగ్) నిర్మాణంలోనే జరుగుతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో కొన్ని లోపాల వలన భవన జీవితం తగ్గిపోతూ ఉంటుంది. ఇందులో ముఖ్యమైBUILD IT RIGHTనది ఫుట్టింగ్ స్థాయి. ఫుట్టింగ్ (బేస్) స్థాయి వద్ద, ప్రాపర్ గా PCC (ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్)ని 40mm గ్రావెల్ తో కనీసం 6 అంగుళాల మందంతో వేసి, దానిపై ఫుట్టింగ్ మ్యాట్ ఉంచాలి. ఫుట్టింగ్ మ్యాట్ స్టీల్, ఎట్టి పరిస్థితుల్లోనూ PCCని లేదా చుట్టూ ఉన్న మట్టిని తాకకూడదు. అలా తాకడం వలన స్టీల్ త్వరగా తుప్పు పట్టి, పునాది బలహీనపడి, భవనం పటిష్టత దెబ్బతింటుంది. దీనిని నివారించడానికి కాంక్రీట్ కవర్ కోసం 50mm కవర్ బ్లాక్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలి.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మ్యాట్‌కు చుట్టూ స్టీల్‌ను బెండ్ చేయడం. దీనివల్ల కాంక్రీట్ బలంగా పట్టుకోవడమే కాకుండా, భవనంపై వచ్చే బెండింగ్ మూమెంట్స్, వైబ్రేషన్స్ ను సమర్థవంతంగా తట్టుకుంటుంది. దురదృష్టవశాత్తు, దాదాపు 90% మంది ప్రజలు ఈ కీలకమైన దశలో పొరపాట్లు చేస్తుంటారు. పునాది మ్యాట్స్ మన పాదాల వంటివి. వాటి చుట్టూ ఉన్న బెండ్స్ మన కాలి వేళ్ళ వంటివి. ఇవి మనం బరువు మోసినా, కుదుపులకి తట్టుకుని నిలబడటానికి ఎలా సహాయపడతాయో, అలాగే భవనానికి స్థిరత్వాన్ని అందిస్తాయి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా భవన జీవితాన్ని సుదీర్ఘకాలం ఉండేలా చేయవచ్చు.

గృహ నిర్మాణంలో మొదటి పొరపాటు సరైన ఫుట్టింగ్ (బేస్) వేయకపోవడమేనని చెబుతున్నారు నిపుణులు. నాణ్యమైన సిమెంట్, సరైన కంకర నిష్పత్తి, తగిన లోతు, మట్టి పరీక్ష, సరైన క్యూరింగ్ చేయకపోతే భవనం పటిష్టత దెబ్బతింటుంది. బలమైన పునాది కోసం ఇంజనీర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి
House Footings

House Footings

ఇది కూడా చదవండి: Health Insurance: సంచలన నిర్ణయం.. రూ. 25 లక్షల వరకు ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య సేవలు..!

ఇది కూడా చదవండి: House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..