AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?

House Construction: ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఇంకా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో రకరకాల రేట్లు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి ఖర్చు మారుతుందని గుర్తించుకోండి. అయితే ఈ ధరలు గత ఏడాది నిర్మాణం..

House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?
House Construction Pillar Foundation
Subhash Goud
|

Updated on: Aug 19, 2026 | 5:28 PM

Share

House Construction: మీరు 150 గజాల స్థలంలో మీ కలల ఇంటిని నిర్మించాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి పునాది దశలో అంటే పిల్లర్ల నిర్మాణం కోసం ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇందులో 12 పిల్లర్ల పునాది నిర్మాణానికి అయ్యే ఖర్చుల గురించి తెలుసుకుందాం. ఈ ఖర్చు కేవలం అంచనా మాత్రమే. ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఇంకా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో రకరకాల రేట్లు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి ఖర్చు మారుతుందని గుర్తించుకోండి. అయితే ఈ ధరలు గత ఏడాది నిర్మాణం చేసిన ఓ ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం అందిస్తున్నాము. ఇప్పుడు ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని గుర్తించుకోండి.

ప్రారంభంలో మార్కింగ్, తవ్వకాలు:

నిర్మాణం ప్రారంభంలో స్థలాన్ని మార్కింగ్ చేయడం అత్యంత ముఖ్యం. 12 పిల్లర్ల కోసం మార్కింగ్ చేయడానికి మేస్త్రికి సుమారుగా రూ.3,000, తెల్ల సున్నం, అల్పిల్లు వంటి మెటీరియల్స్‌కు రూ.500 ఖర్చయ్యింది. తర్వాతి దశలో, జె.సి.బి ఉపయోగించి గుంతలను తవ్వించాలి. పునాది గుంతలు 5×5 అడుగుల కొలతతో, 6 నుండి 6.5 అడుగుల లోతులో తవ్వాల్సి ఉంటుంది. జేసీబీకి రూ.9,000 అనుకుందాం.. గుంతలు తీయించడానికి సహాయపడిన ఇద్దరు మనుషులకు రూ.1,200 కలిపి మొత్తం రూ.10,200 ఖర్చు అవుతుంది. గుంతలు తీసిన తర్వాత వాటిని లెవెల్ చేయడానికి రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Zudio: జుడియో బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుందో తెలుసా? బిజినెస్‌ సీక్రెట్‌ ఇదే..!

పిల్లర్ మార్కింగ్

గుంతలను లెవెల్ చేసిన తర్వాత, పీసీసీ వేస్తారు. దీనికి అవసరమైన మెటీరియల్స్‌లో ఇసుక, మెటల్ (40mm), సిమెంట్ ఉన్నాయి. నాలుగు లోడ్ల ఇసుకకు రూ.5,200, ఒక లోడు 40mm మెటల్‌కు రూ.4,200 ఖర్చయ్యింది. పి.సి.సి వేయడానికి, పిల్లర్ మార్కింగ్ కోసం 5 బ్యాగుల సిమెంట్ ఉపయోగించారు. పి.సి.సి వేయడానికి లేబర్ ఛార్జీలు రూ.1,800 కాగా, పి.సి.సి వేసిన తర్వాత పిల్లర్ల మార్కింగ్ చేయడానికి రూ.3,200 ఖర్చయ్యింది.

ఐరన్ వర్క్, దాని ఖర్చు:

పిల్లర్ నిర్మాణంలో ఐరన్ (రాడ్లు) ఒక కీలక భాగం. ఈ నిర్మాణంలో ప్రతి పిల్లర్‌కు 6 – 16mm రాడ్లు ఉపయోగించారు. గ్రౌండ్ ఫ్లోర్‌కు, భవిష్యత్తులో పై అంతస్తులు నిర్మించే అవకాశం ఉన్నందున ఈ బలమైన రాడ్లను ఎంచుకున్నారు. 12 పిల్లర్లకు అవసరమయ్యే ఐరన్ (36 – 16mm రాడ్లు, 30 – 10mm రాడ్లు, రవాణా ఖర్చులు సహా) మొత్తం రూ.80,000 అయ్యింది. ఈ ఐరన్ వర్క్ (రాడ్లు కట్టడం, మ్యాట్లు తయారు చేయడం, గుంతల్లో అమర్చడం) చేయడానికి లేబర్ ఛార్జీలు రూ.12,000 అయ్యాయి.

పుట్టింగ్ కాంక్రీట్, మొత్తం అంచనా:

చివరి దశలో పిల్లర్ పుట్టింగ్‌లకు కాంక్రీట్ వేయడం ఉంటుంది. దీనికి 3 యూనిట్ల 20mm మెటల్ రూ.15,000 ఖర్చు. సిమెంట్ విషయానికి వస్తే, ప్రారంభంలో ఉపయోగించిన 5 బ్యాగులతో కలిపి, పుట్టింగ్ కాంక్రీట్‌కు మొత్తం 55 బ్యాగుల అల్ట్రాటెక్ సూపర్ సిమెంట్ ఉపయోగించారు. ఒక్కో బ్యాగు రూ.330 చొప్పున మొత్తం రూ.18,150. కాంక్రీట్ వేయడానికి (మిల్లర్ ఛార్జీలు, లేబర్ ఛార్జీలు కలిపి, 48 బస్తాల కాంక్రీట్ కోసం) రూ.16,000 ఖర్చయ్యింది.

మొత్తం ఖర్చులు:

ఈ వివరాలన్నీ కలిపితే, 12 పిల్లర్ల పునాది నిర్మాణానికి అయ్యిన మెటీరియల్, లేబర్ ఛార్జీలు మొత్తం రూ.1,71,350. ఇక భోజనాలు వంటి అదనపు ఖర్చులను కూడా కలుపుకుంటే ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ.1,75,000 అయినట్లు సదరు యజమాని తెలిపారు. మీ ప్రాంతం, మెటీరియల్ ధరలు, లేబర్ రేట్లను బట్టి ఈ ఖర్చులు మారవచ్చు.

ఇది కూడా చదవండి: Goat Farming: ఏ మేక జాతి ఎక్కువ ఆదాయం, పాలను ఇస్తుంది? ఈ మేకలతో కోటీశ్వరులు కావచ్చు..!

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మరోసారి వరుస సెలవులు.. కారణం ఏంటంటే..!

ఇది కూడా చదవండి: Success Story: రూ.10 వేలతో మొదలుపెట్టి రూ.3 కోట్లు.. వీటి సాగుతో రికార్డు సృష్టించిన అన్నదమ్ములు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర