AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goat Farming: ఏ మేక జాతి ఎక్కువ ఆదాయం, పాలను ఇస్తుంది? ఈ మేకలతో కోటీశ్వరులు కావచ్చు..!

Goat Farming: గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆవులు, మేకల పెంపకం వైపు మళ్లుతున్నారు. మేకల పెంపకం ఒక లాభదాయకమైన వ్యాపారంగా పరిగణిస్తారు. పాలు, మాంసం లభించడం వల్ల మేకల పెంపకం ద్వారా మీరు అధిక ఆదాయం సంపాదించవచ్చు. అయితే మేకల పెంపకం..

Goat Farming: ఏ మేక జాతి ఎక్కువ ఆదాయం, పాలను ఇస్తుంది? ఈ మేకలతో కోటీశ్వరులు కావచ్చు..!
Goat Farming
Subhash Goud
|

Updated on: Aug 17, 2026 | 9:32 PM

Share

Goat Farming: ఇటీవలి కాలంలో యువత ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు చేసే ఉద్యోగాలతో విసిగిపోయి, సొంత వ్యాపారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆవులు, మేకల పెంపకం వైపు మళ్లుతున్నారు. మేకల పెంపకం ఒక లాభదాయకమైన వ్యాపారంగా పరిగణిస్తారు. పాలు, మాంసం లభించడం వల్ల మేకల పెంపకం ద్వారా మీరు అధిక ఆదాయం సంపాదించవచ్చు. అయితే మేకల పెంపకంలో ఏ జాతి మేకను ఎంచుకోవాలనేది ముఖ్యం. మీరు మీ ప్రాంతానికి, బడ్జెట్‌కు అనుగుణంగా మేకను ఎంచుకోవాలి.

ఇది కూడా చదవండి: Success Story: రూ.10 వేలతో మొదలుపెట్టి రూ.3 కోట్లు.. వీటి సాగుతో రికార్డు సృష్టించిన అన్నదమ్ములు!

జమునాపారి జాతి:

ఈ జాతి మేకలు చాలా బరువుగా ఉంటాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఎటావాలో ప్రసిద్ధి చెందాయి. వీటికి పొడవాటి చెవులు, చిలుకలా వంకర ముక్కు ఉంటాయి. ఇవి రోజుకు సుమారు 2 నుండి 3 లీటర్ల ముదురు రంగు పాలను ఇస్తాయి. వాటి బరువు కారణంగా ఈ మేకలు అధిక ధరకు అమ్ముడవుతాయి.

ఇవి కూడా చదవండి

బార్బరీ జాతి:

చిన్న రైతులు బార్బలీ జాతి మేకలను ఎంచుకోవచ్చు. ఈ మేకలు ఒకేసారి రెండు కంటే ఎక్కువ పిల్లలకు జన్మనివ్వగలవు. జింకలను పోలి ఉంటాయి. మేకలను చిన్న ప్రదేశంలో కూడా సులభంగా పెంచవచ్చు. ఇవి ప్రతిరోజూ 1 నుండి 1.5 లీటర్ల పాలను ఇస్తాయి. ఇవి సంవత్సరానికి రెండుసార్లు పిల్లలకు జన్మనిస్తాయి.

బీటిల్ జాతి:

ఈ జాతి పంజాబ్, హర్యానాలో అత్యంత ప్రసిద్ధి చెందింది. జమునాపారి జాతి మేకలు ఎత్తైన ప్రదేశాలకు చెందినవి. తక్కువ సమయంలో చిన్న ప్రాంతానికి అలవాటుపడతాయి. ఈ మేకలు రోజుకు సుమారు 2 నుండి 3.5 లీటర్ల పాలు ఇస్తాయి. ఈ మేకలు తక్కువ సమయంలోనే బరువు పెరుగుతాయి.

బ్లాక్ బెంగాల్:

మీరు మాంసం కోసం మేకలను పెంచుతున్నట్లయితే, బ్లాక్ బెంగాల్ ఉత్తమ ఎంపిక. ఈ జాతి మేకలను ఎక్కువగా పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో పెంచుతారు. బ్లాక్ బెంగాల్ మేకలు రోజుకు అర లీటరు నుండి ఒక లీటరు వరకు మాత్రమే పాలు ఇస్తాయి. ఈ మేకలు ఒకేసారి రెండు నుండి మూడు పిల్లలకు జన్మనిస్తాయి. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది.

సురతి మేక:

సౌమ్య స్వభావం గల సూరతీ మేకలు ఎక్కువగా గుజరాత్ ప్రాంతంలో కనిపిస్తాయి. రోజుకు 1.5 నుండి 2.5 లీటర్ల పాలు ఇచ్చే ఈ మేకలకు అధిక గిరాకీ ఉంది. పోషక విలువలున్న ఈ పాలు త్వరగా జీర్ణమవుతాయి. ప్రత్యేక గిరాకీ ఉన్న ఈ మేక పాలను అమ్మడం ద్వారా మీరు మంచి ఆదాయం సంపాదించవచ్చు.

సిరోహి జాతి:

ఈ మేకలు అధిక ఉష్ణోగ్రతలకు అలవాటుపడి తక్కువ ఆహారం తీసుకుంటాయి. రోజుకు 1 నుండి 1.5 లీటర్ల పాలు ఇచ్చే సిరోహి జాతి మేకలు తక్కువ సమయంలోనే బరువు పెరుగుతాయి. ఈ మేకల శరీరంపై గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. అలాగే ఇవి రాజస్థాన్ వంటి ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి.

ఉస్మానాబాది జాతి:

మహారాష్ట్ర, కర్ణాటకలో ఉస్మానాబాది జాతి మేకలను పెంచుతారు. ఈ మేకలు ఏ వాతావరణానికైనా అలవాటుపడతాయి. రోజుకు 1 నుండి 1.5 లీటర్ల పాలను ఇస్తాయి. ఇవి సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు కవల పిల్లలకు జన్మనిస్తాయి. ఈ పిల్లల అమ్మకం ద్వారా రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Best Bike: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో..!

ఇది కూడా చదవండి: Compound Wall Cost: తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us