AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Compound Wall Cost: తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

Compound Wall Cost: తక్కువ బడ్జెట్‌లో నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని చేపట్టడం ఎలాగో తెలుసుకోవడం అవసరం. 100 అడుగుల పొడవు, 11 అడుగుల ఎత్తు గల కాంపౌండ్ వాల్‌ను పిల్లర్లు, బీమ్స్‌తో నిర్మించడానికి అయ్యే ఖర్చుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ అంచనా సిమెంట్..

Compound Wall Cost: తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
Compound Wall Cost
Subhash Goud
|

Updated on: Aug 17, 2026 | 6:00 AM

Share

Compound Wall Cost: ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలన్న ప్రతి ఒక్కరి కల. అయితే మధ్య తరగతి వారికి ఇంటి నిర్మాణానికి డబ్బులు సమకూర్చుకోవడం పెద్ద సవాలు. మరి ఇంటిని నిర్మించిన తర్వాత కాంపౌండ్‌ వాల్‌ను నిర్మించుకోవడం కూడా ముఖ్యమే. సురక్షితమైన, దృఢమైన కాంపౌండ్ వాల్ నిర్మాణం ఇంటి యజమానులకు ముఖ్యమైనది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని చేపట్టడం ఎలాగో తెలుసుకోవడం అవసరం. 100 అడుగుల పొడవు, 11 అడుగుల ఎత్తు గల కాంపౌండ్ వాల్‌ను పిల్లర్లు, బీమ్స్‌తో నిర్మించడానికి అయ్యే ఖర్చుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ అంచనా సిమెంట్ రాళ్లను ఉపయోగించి చేయబడింది. ఇది ఇటుకల కంటే ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది.

కాంపౌండ్ వాల్ నిర్మాణం వివరాలు:

ఈ వాల్ నిర్మాణం మొత్తం 11 అడుగుల ఎత్తు ఉంటుంది. భూమిలో మూడు అడుగుల లోతు వరకు పునాది, దానిపైన ఒక అడుగు బీమ్, తర్వాత ఏడు అడుగుల గోడ, చివరగా పైన నాలుగు అంగుళాల కాంక్రీట్ బెడ్ ఉంటాయి. గోడ బలాన్ని పెంచడానికి ప్రతి పది అడుగులకు ఒక పిల్లర్ చొప్పున మొత్తం 10 పిల్లర్లు వేయాల్సి ఉంటుంది. గోడ నిర్మాణం సిమెంట్ రాళ్లతో చేస్తారు. వీటిని 8 అంగుళాల మందంతో అడ్డంగా పేర్చడం ద్వారా గోడకు మరింత బలం వస్తుంది.

ఖర్చుల వివరాలు (100 అడుగుల గోడకు):

1. ఐరన్ (స్టీల్) ఖర్చులు:

  • 12 మిమీ బార్లు (40 నంబర్లు): ఒక్కొక్కటి సుమారు 700-740 రూపాయలు. మొత్తం: 28,000 రూపాయలు. (బ్రాండ్‌ను బట్టి ధర మారవచ్చు.)
  • 6 మిమీ బార్లు (40 నంబర్లు): ఒక్కొక్కటి సుమారు 100-110 రూపాయలు. మొత్తం: 4,400 రూపాయలు.
  • బైండింగ్ వైర్: 1,000 రూపాయలు.
  • మొత్తం ఐరన్ ఖర్చు: 33,400 రూపాయలు.

2. పిల్లర్లు, బీమ్స్ వేయడానికి లేబర్ ఖర్చు:

  • పిల్లర్లు, బీమ్స్‌ను కట్టడానికి సుమారు 4,500 నుండి 5,000 రూపాయలు ఖర్చవుతుంది. ఇది పిల్లర్లు, పైపును కలిపి ఉంటుంది.
  • పిల్లర్/బీమ్ లేబర్: 4,500 రూపాయలు.

3. సెంటరింగ్, పిల్లర్ బాక్స్ అద్దె:

  • కింద బెల్ట్ వేయడానికి సెంటరింగ్, పిల్లర్లు పోయడానికి బాక్సుల అద్దెకు సుమారు 6,000 రూపాయలు అవసరం అవుతుంది.
  • సెంటరింగ్/బాక్స్ అద్దె: 6,000 రూపాయలు.

4. సిమెంట్ రాళ్లు:

  • 100 అడుగుల గోడకు మొత్తం 1944 సిమెంట్ రాళ్లు అవసరం. ఒక్కొక్క రాయి ధర 19-20 రూపాయలు.
  • 1944 రాళ్లకు 20 రూపాయలు చొప్పున: 38,880 రూపాయలు.
  • మొత్తం సిమెంట్ రాయి ఖర్చు: 38,880 రూపాయలు.

5. సిమెంట్ బ్యాగులు:

  • పిల్లర్లు, బెల్ట్, కట్టుబడి, ప్లాస్టరింగ్‌కు మొత్తం 45 సిమెంట్ బ్యాగులు అవసరం. ఒక్కో బ్యాగ్ ధర రవాణాతో కలిపి 320 రూపాయలు.
  • 45 బ్యాగులకు 320 రూపాయలు చొప్పున: 14,400 రూపాయలు.
  • మొత్తం సిమెంట్ ఖర్చు: 14,400 రూపాయలు.

6. ఇసుక:

  • మూడు నుండి నాలుగు యూనిట్ల ఇసుక అవసరం అవుతుంది. మూడు యూనిట్ల ఇసుకకు 4,500 రూపాయలు చొప్పున.
  • 3 యూనిట్లకు 4,500 రూపాయలు చొప్పున: 13,500 రూపాయలు.
  • మొత్తం ఇసుక ఖర్చు: 13,500 రూపాయలు.

7.20 మిమీ కాంక్రీట్ అగ్రిగేట్స్ (కంకర):

  • రెండు యూనిట్ల కంకర అవసరం. ఒక యూనిట్ ధర సుమారు 3,800 నుండి 4,000 రూపాయలు.
  • 2 యూనిట్లకు 4,000 రూపాయలు చొప్పున: 8,000 రూపాయలు.
  • మొత్తం కంకర ఖర్చు: 8,000 రూపాయలు.

8. లేబర్ కాస్ట్ (గోడ నిర్మాణం, ప్లాస్టరింగ్):

  • 100 అడుగుల గోడను కట్టడానికి, ప్లాస్టరింగ్ చేయడానికి పిల్లర్లతో కలిపి సుమారు 45,000 నుండి 50,000 రూపాయలు అవుతుంది.
  • మొత్తం లేబర్ ఖర్చు: 45,000 రూపాయలు.

మొత్తం అంచనా ఖర్చు:

పై అన్ని ఖర్చులను కలుపుకుంటే, 100 అడుగుల పిల్లర్లు, బీమ్స్‌తో కూడిన సిమెంట్ రాయి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సుమారు 1,64,180 రూపాయలు అవుతుంది.

ఖర్చుల పోలికలు, గమనికలు:

  • ఇటుకలు vs. సిమెంట్ రాళ్లు: ఇటుకలను ఉపయోగిస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. ఇటుక సైజు చిన్నది కావడం వల్ల ఎక్కువ ఇసుక, సిమెంట్, లేబర్ అవసరం అవుతాయి. సిమెంట్ రాళ్లు 8 అంగుళాల మందంతో వాడుకోవడం వల్ల బలం పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది.
  • పిల్లర్లు లేకుండా నిర్మాణం: ఒకవేళ పిల్లర్లు, బీమ్స్ లేకుండా కేవలం గోడ నిర్మాణం చేపడితే, సుమారు 1,05,000 రూపాయలలో పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇది గోడ బలంపై ప్రభావం చూపుతుంది.
  • ప్రాంతం వారీగా ధరల వ్యత్యాసం: పైన పేర్కొన్న ధరలు మార్కెట్ అంచనాలు మాత్రమే. ప్రాంతాన్ని బట్టి, మెటీరియల్ బ్రాండ్లను బట్టి, లేబర్ డిమాండ్‌ను బట్టి ధరలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ సమాచారం మీకు తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన కాంపౌండ్ వాల్‌ను నిర్మించడానికి ఒక స్పష్టమైన అంచనాను అందిస్తున్నామని గమనించండి.

ఇది కూడా చదవండి: Wood vs UPVC Windows: వుడ్ విండోస్ వర్సెస్ యూపీవీసీ విండోస్.. తక్కువ ఖర్చులో మీ ఇంటికి ఏది బెస్ట్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం
అర టేబుల్ స్పూన్‌ తీసుకుంటే.. ఆస్తమా, శ్వాస సమస్యలు పూర్తి ఉపశమనం
తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు..?
తక్కువ ధరల్లో 100 అడుగుల కాంపౌండ్ వాల్‌ నిర్మాణానికి ఎంత ఖర్చు..?
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ రైళ్లు..!
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ రైళ్లు..!
సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు?
సేవింగ్స్ అకౌంట్‌లో ఏడాదికి ఎంత క్యాష్ డిపాజిట్ చేయవచ్చు?
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..