AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిట్ట మధ్యాహ్నమే దేశమంతా చిమ్మ చీకటి.. ఆగస్టు 12న ఏం జరగబోతుందో తెలుసా?

ఆకాశంలో అరుదైన అద్భుతం ఆవిష్కృతం కానుంది. సాధారణ రోజుల్లోలా కాకుండా ఆరోజు మనకు సూర్యుడు బిన్నంగా కనిపిస్తాడు. ఎప్పుడూ భగభగ మండుతూ వెలిగిపోయే సూర్యూడు ఆరోజు మాత్రం.. నల్లగా మారిపోనున్నాడు. అదే సంపూర్ణ సూర్య గ్రహణం. ఇంతరూ ఆ గ్రహం ఎప్పుడు సంభవించబోతుందనేగా మీ డైట్ అదితెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మిట్ట మధ్యాహ్నమే దేశమంతా చిమ్మ చీకటి.. ఆగస్టు 12న ఏం జరగబోతుందో తెలుసా?
Solar Eclipse Viewing Guide
M Sivakumar
| Edited By: |

Updated on: Aug 03, 2026 | 2:54 PM

Share

ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీన ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. ఎప్పుడూ ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించే సూర్యుడు ఆరోజూ మాత్రం నల్లటి ఆకారంలోకి మారనున్నాడు. అవును ఆరోజు సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా చంద్రడు సూర్యున్ని మొత్తం కమ్మేస్తాడు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి ముందుకు వచ్చి సూర్యుడి కాంతిని కొంతసేపు అడ్డుకుంటాడు. దీన్నే సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా సూర్యుడిని కప్పివేయడంతో ఆ ప్రాంతాల్లో పగటి సమయంలోనే రాత్రి వాతావరణం ఏర్పడుతుంది.

ఈ అరుదైన ఖగోళ ఘటన గ్రీన్ల్యాండ్, ఐస్లాండ్, స్పెయిన్, రష్యాలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాల్లో సంపూర్ణంగా కనిపించనుంది. ఇక ఐరోపా, ఉత్తర ఆఫ్రికాలోని పలు దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. గ్రహణం సమయంలో ఆకాశంలో సూర్యుని చుట్టూ కనిపించే ప్రకాశవంతమైన సూర్య వాతావరణం శాస్త్రవేత్తలకు కీలక పరిశోధనలకు అవకాశం కల్పిస్తుంది. సూర్యుడి వాతావరణం, అంతరిక్ష వాతావరణ మార్పులపై అధ్యయనాలకు ఈ ఘటన ఎంతో ఉపయోగ పడుతుంది.

అయితే సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడటం ప్రమాదకరం. ప్రత్యేకమైన సోలార్ ఫిల్టర్లు లేదా శాస్త్రీయ పద్ధతుల్లో మాత్రమే వీక్షించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించకపోయినా, ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆకాశంలో చోటుచేసుకునే ఈ అరుదైన దృశ్యం మరోసారి విశ్వ రహస్యాలపై ఆసక్తిని పెంచనుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us