ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏకంగా 526 కిలోమీటర్ల ప్రయాణం.. చౌకైన కారు

July 28, 2026

Subhash

కియా తన కొత్త, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. అ కారు కియా సైరోస్ EV. ఇది శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది.

ఎలక్ట్రిక్ కారు

కొత్త కియా సైరోస్ డెలివరీలు జూలై 30న ప్రారంభమవుతాయి. ఈ కారు 42kWh, 51.4kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ కారు డిజైన్ దాని ICE నుంచి ప్రేరణ పొందింది. 

కొత్త కియా

కియా సైరోస్ EV రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 42kWh వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ.13,49,900 నుండి ప్రారంభమవుతుంది

ధర ఎంత?

అదే 51.4kWh బ్యాటరీ ఆప్షన్ ధర రూ.16,99,900 నుండి ప్రారంభం కాగా, టాప్ వేరియంట్ (X లైన్) ధర ఎక్స్-షోరూమ్‌లో రూ.19,99,900గా ఉంది.

బ్యాటరీ ఆప్షన్

ఈ కారు దాని ఐసిఇ (ICE) వేరియంట్‌ను పోలి ఉంటుంది. కారు మొత్తం ఆకారంలో ఎలాంటి మార్పు లేదు. దీనికి కొన్ని ఈవీ (EV) అంశాలను ఖచ్చితంగా జోడించారు. 

వేరియంట్‌

42kWh బ్యాటరీతో కూడిన సైరోస్ EV వేరియంట్ 443 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. 51.4kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై 526 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. 

బ్యాటరీ

ఈ కారు 8.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనిని 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 39 నిమిషాలు పడుతుంది.

వేగం

ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, వెనుక, ముందు పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటర్ మరెన్నో..

ఎయిర్‌బ్యాగ్‌లు