AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం బాగుపడుతుంది: చిరంజీవి

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్‌గా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, టీఎఫ్‌డీసీ దిల్‌ రాజు హాజరయ్యారు.

ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం బాగుపడుతుంది: చిరంజీవి
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2026 | 10:28 PM

Share

2025 గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో చిరంజీవి మాట్లాడుతూ..  అవార్డుల వేడుకను తిరిగి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డిగారిని కలిసిన ప్రతిసారి సినిమాల గురించి, సినిమాలను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు. ఎంతో కళకళలాడుతూ జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి మూల విరాట్ అయినటు వంటి రేవంత్ రెడ్డిగారికీ, భట్టి విక్రమార్క, జూపల్లి గారికీ లోక నాయకుడు కమల్‌ హాసన్‌, నాగార్జున గారికి, నాగేశ్వరరావు అవార్డు అందుకుంటున్న జయసుధ నాగచైతన్య, రష్మిక మందన్న అందరికీ స్వాగతం అభినందలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం దేశం బాగుపడుతుందని నానుడి.. ఆ నానుడి అర్ధం పరమార్థం గ్రహించి… రేవంత్‌ రెడ్డిగారు సినిమా ప్రభావాన్ని గుర్తించి మళ్లీ అవార్డుల వేడుకకు పునర్జీవం పోశారు. అందుకు రేవంత్‌ రెడ్డిగారికి కృతజ్ఞతలు.

సినిమాకు కావాల్సిన అన్న వసతులు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇక్కడ భారతదేశ సినిమాకు కేంద్రంగా మార్చటం అనే బృహత్ కార్యాన్ని భట్టి విక్రమార్క గారికి అప్పగించారు. కే పాప్‌, యానిమే లాంటి సినిమాలు ఆయా కంట్రీల ఎకానమినీ ప్రభావితం చేశాయి. హాలీవుడ్ అంటే అగ్రరాజ్యం గుర్తొంస్తుంది. తెలంగాణ కూడా అలా ఎదగాలి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ సినిమాను ప్రోత్సహించాలి. ఆయన ఆలోచన చేయాలని కోరుతున్నాను. అవార్డుల ఎంపిక కూడా చాలా బాగుంది. సీనియర్లకు గౌరవం, యంగస్టర్స్‌కు ప్రోత్సాహకంగా ఉంది.. అందుకు జ్యూరీకి కూడా అభినందనలు అని చిరంజీవి అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us