AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక బ్యాంక్‌ ఏదో తెలుసా..? ప్రపంచ సంపదలో మూడొంతుల డబ్బు ఇక్కడే ఉంది..!

ఇది కేవలం బ్యాంకు కాదు, ఇది ఒక ఆర్థిక మహాసముద్రం కూడా. తాజా గణాంకాల ప్రకారం, దీని మొత్తం ఆస్తి విలువ 6.9 ట్రిలియన్ డాలర్లు. అంటే, సుమారు రూ. 612.25 లక్షల కోట్లు. 2012 నుండి ఈ బ్యాంక్ ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఉంది. అమెరికా లేదా యూరప్‌లోని ఏ బ్యాంకు కూడా ఇప్పటివరకు దీనిని అధిగమించలేకపోయింది.

ఆసియా ఖండంలోనే అత్యంత ధనిక బ్యాంక్‌ ఏదో తెలుసా..? ప్రపంచ సంపదలో మూడొంతుల డబ్బు ఇక్కడే ఉంది..!
World's Largest Bank
Jyothi Gadda
|

Updated on: Nov 22, 2025 | 5:58 PM

Share

ఆసియా ఖండంలోని శక్తివంతమైన దేశానికి చెందిన ఒక కంపెనీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అసాధారణ ఆధిపత్యాన్ని పొందుతోంది. ఈ పారిశ్రామిక, వాణిజ్య బ్యాంకు ఆస్తి విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. ఈ బ్యాంకు ఆస్తుల మొత్తం విలువను లెక్కించడానికి సంవత్సరాలు పడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రత్యేకమైన, సంపన్న బ్యాంకును ICBC అని పిలుస్తారు. ఇది కేవలం బ్యాంకు కాదు, ఇది ఒక ఆర్థిక మహాసముద్రం కూడా. తాజా గణాంకాల ప్రకారం, దీని మొత్తం ఆస్తి విలువ 6.9 ట్రిలియన్ డాలర్లు. అంటే, సుమారు రూ. 612.25 లక్షల కోట్లు. 2012 నుండి ICBC నిరంతరం ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఉంది. అమెరికా లేదా యూరప్‌లోని ఏ బ్యాంకు కూడా ఇప్పటివరకు దీనిని అధిగమించలేకపోయింది.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పెద్దదే. కానీ, ఇది ఐసీబీసీ కంటే చాలా చిన్నది. ఎస్బీఐ మొత్తం ఆస్తులు రూ. 67 లక్షల కోట్లు అయినప్పటికీ, ఇది ఐసీబీసీ మొత్తం ఆస్తుల కంటే తొమ్మిది రెట్లు తక్కువ. ఈ నికర విలువ వ్యత్యాసాన్ని బట్టి చూస్తే, ప్రపంచ స్థాయిలో ఐసీబీసీతో సరిపోలగల సంస్థలు చాలా తక్కువ అని చెప్పవచ్చు.

చైనాలో చారిత్రక ఆర్థిక సంస్కరణల కాలంలో ICBC స్థాపించబడింది. 1978లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కేంద్ర కమిటీ దేశంలో ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. దీని వలన పారిశ్రామిక, వాణిజ్య బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి కొత్త సంస్థలు అవసరం ఏర్పడింది. సెప్టెంబర్ 1983లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పారిశ్రామిక, వాణిజ్య బ్యాంకింగ్ విధులను దాని నుండి వేరు చేసి పూర్తిగా కేంద్ర బ్యాంకుగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తర్వాత, ICBC అధికారికంగా జనవరి 1, 1984న కార్యకలాపాలను ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

ICBC చైనాకే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా దీనికి దాదాపు 16,456 శాఖలు ఉన్నాయి. వీటిలో 416 శాఖలు ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, ఓషియానియా, దక్షిణ అమెరికా వంటి ఖండాలలో విస్తరించి ఉన్నాయి. ఈ బ్యాంకు సింగపూర్, హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడింది. అయితే, చైనా ప్రభుత్వం దాని అతిపెద్ద వాటాదారు. ICBC విస్తారమైన నెట్‌వర్క్, అపారమైన ఆస్తి విలువ దీనిని ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా చేస్తాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి