AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే ఈజీగా మీ బంగారు నగలు పాలిష్ చేసుకోవచ్చు..! ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..

పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. ఇప్పుడు ప్రజలంతా బంగారు, వెండి ఆభరణాల కోసం ఆరాటపడుతుంటారు. అందుకోసం కొందరు కొత్తవి కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు పాతవాటికి పాలిష్ చేయిస్తుంటారు. కానీ, మార్కెట్లో బంగారం, వెండి నగలకు పాలిష్‌ చేయించాలంటే కూడా ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. అందుకే, ఇంట్లోనే మీ నగలకు పాలిష్‌ పెట్టుకోవచ్చు. ఇందుకోసం కొన్ని సింపుల్‌ టిప్స్‌ ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

ఇంట్లోనే ఈజీగా మీ బంగారు నగలు పాలిష్ చేసుకోవచ్చు..! ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..
Hacks To Clean Jewellery At Home
Jyothi Gadda
|

Updated on: Nov 16, 2025 | 6:49 PM

Share

నవంబర్ ప్రారంభంతో వివాహాల సీజన్ కూడా మొదలవుతుంది.. ఈ సమయంలో సాధారణంగానే మహిళలు తమ పట్టుచీరలు, ఆభరణాలు, అలంకరణ పట్ల ఎక్కువగా ఆందోళనపడుతుంటారు. ఈ క్రమంలోనే వివాహ సన్నాహాలు కొన్ని నెలల ముందు నుంచే మొదలుపెడతారు. చాలా మంది మహిళలు వివాహ వేడుకలో అందంగా కనిపించడానికి ఆరాటపడుతుంటారు. కొత్త బట్టలు, కొత్త నగలు కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ, ప్రస్తుతం పెరిగిపోయిన బంగారం ధరల కారణంగా కొత్త నగలు కొనడం కష్టమే. అందుకే ఎక్కువ మంది తమ పాత నగలకు మెరుగులు పెట్టిస్తుంటారు. మీరు కూడా మీ పాత నగలను ఇంట్లోనే మెరిసేలా చేసుకునేందుకు కొన్ని అద్భుతమై చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

కొంతకాలం తరువాత బంగారం, వెండి ఆభరణాలు వాటి అసలు మెరుపును కోల్పోతాయి. డల్‌గా మారి, వాటి అసలు మెరుపును కోల్పోతాయి. చాలా మంది వాటిని శుభ్రం చేసుకోవడానికి నగల దుకాణాలకు వెళ్తుంటారు. కానీ,ఇది ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. కాబట్టి, మీరు సులభమైన, చవకైన పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే, ఈ వార్త మీ కోసమే. ఈ రోజు మీ పాత ఆభరణాలను కొత్తవిలా మెరిసేలా చేయడంలో మీకు సహాయపడే కొన్ని సాధారణ ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

1. గోరువెచ్చని నీరు, సబ్బు:

ఇవి కూడా చదవండి

ఇంట్లోనే మీ బంగారు, వెండి ఆభరణాలను పాలిష్ చేసుకోవటం ఇప్పుడు ఈజీ అవుతుంది. ఈ టిప్స్‌ పాటిస్తే మీ పాత బంగారు నగలు తిరిగి కొత్తవాటిలా మెరుస్తూ కనిపిస్తాయి. ఇందుకోసం సబ్బు, షాంపూను గోరువెచ్చని నీటితో కలపండి. మీ ఆభరణాలను ఈ ద్రావణంలో 10 నుండి 15 నిమిషాలు నానబెట్టాలి. తరువాత, మృదువైన వస్త్రం లేదా బ్రష్‌తో స్క్రబ్ చేసి శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇది మీ బంగారు, వెండి నగలను మెరిసేలా చేస్తుంది.

2. పసుపు, టూత్‌పేస్ట్:

మీ బంగారు, వెండి ఆభరణాలను మెరిసేలా చేయడానికి మీరు పసుపు, టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. ఇందుకోసం టూత్‌పేస్ట్‌తో కొద్దిగా పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని బ్రష్‌కు అప్లై చేసి, ఆభరణాలను సున్నితంగా స్క్రబ్ చేయండి. కొద్దిసేపటి తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది ఆభరణాల మెరుపును తిరిగి తీసుకువస్తుంది.

3. వెనిగర్, నీరు:

బంగారు, వెండి ఆభరణాల మెరుపును తీసుకు వచ్చేందుకు మీరు వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. అర కప్పు వెనిగర్‌ను అర కప్పు నీటితో కలపండి. మీ ఆభరణాలను ఈ ద్రావణంలో 10 నుండి 15 నిమిషాలు నానబెట్టండి. మృదువైన బ్రష్‌తో సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇది మీ ఆభరణాలను మెరిసేలా చేస్తుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..