AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 రోజుల పాటు ప్రతిరోజూ 1 కప్పు దానిమ్మ గింజలు తింటే శరీరంలో జరిగే మ్యాజిక్‌ తెలిస్తే..

ఒక రత్నాల పెట్టెలా కనిపించే పండు ఏదైనా ఉందంటే అది దానిమ్మ. రసంతో నిండిన ఆ రూబీ-ఎరుపు రంగు ముత్యాలాంటి విత్తనాలు చూడటానికి అందంగా ఉండటమే కాదు.. అవి బలమైన ఆరోగ్య శక్తితో నిండి ఉంటాయి. శతాబ్దాలుగా దానిమ్మపండ్లు వాటి వైద్య, శక్తినిచ్చే లక్షణాల కారణంగా దానిమ్మ సర్వరోగ నివారిణిగా పిలుస్తారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా దానిమ్మ పండ్లు తినడం అలవాటు చేసుకోండి. క్రమం తప్పకుండా 21 రోజుల పాటు ప్రతిరోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు తింటే ఎన్ని లాభాలో ఇక్కడ తెలుసుకుందాం..

21 రోజుల పాటు ప్రతిరోజూ 1 కప్పు దానిమ్మ గింజలు తింటే శరీరంలో జరిగే మ్యాజిక్‌ తెలిస్తే..
Pomegranate
Jyothi Gadda
|

Updated on: Nov 16, 2025 | 5:02 PM

Share

ప్రతిరోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు తినటం వల్ల లెక్కలేనన్నీ లాభాలు ఉన్నాయి. ఇవి మన మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండు పుష్కలమైన పోషకాలతో నిండి ఉంటుంది. తక్కువ కేలరీలు, కొవ్వు ఉండటం వల్ల త్వరగా బరువు తగ్గటానికి వీలుగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మతో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వ్యాధులను నిరోధించేందుకు సహాయపడతాయి.

దానిమ్మ గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అజీర్ణం సమస్యను నివారిస్తుంది. అలాగే దీనిలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు పేగుల్లో మంట, వాపు వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. దానిమ్మ గింజల్లో పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని యూవీ కిరణాలు, ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడుతాయి. తద్వారా చర్మం ఎల్లపుడూ యవ్వనంగా కనిపిస్తుంది.

కండరాల నొప్పులు, గాయాలు తగ్గించడంలో దానిమ్మ గింజలు సహాయపడతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కండరాలను బలంగా ఉంచుతాయి. దానిమ్మ గింజల్లోని పాలిఫినాల్స్ రక్తపోటు అదుపులో ఉంచి గుండెపై ఒత్తిడి నివారిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

దానిమ్మ గింజలు నమలడం ద్వారా దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. అలాగే దంతాలు తెల్లగానూ తయారవుతాయి. నోటి దుర్వాసన దూరమవుతుంది. దానిమ్మ గింజల్లో ఉండే ఫైబర్ పేగు కండరాల కదలికలను మెరుగుపరుస్తుంది. మలం గట్టిపడకుండా చూస్తుంది. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు దానిమ్మ గింజలు రెగ్యులర్‌గా తినడం మంచిది. వీటిలోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ కరిగించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి.

దానిమ్మ గింజలు 21 రోజుల పాటు తినడం ద్వారా ఒత్తిడి కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి తక్షణ శక్తిని అందించి మంచి మూడ్‌ను అందిస్తాయి. తద్వారా ఒత్తిడి దూరమవుతుంది. దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి మెదడు కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. తద్వారా జ్ఞాపకశక్తి బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us