Sleeping Tips: బెడ్‌కి గుడ్‌బై చెప్పండి.. నేలపై నిద్రపోతే సూపర్ బెనిఫిట్స్..! రెండువారాల్లోనే మీ శరీరంలో..
మీరు కూడా మీ పరుపును వదిలి రెండు వారాల పాటు నేలపై పడుకోవటం అలవాటు చేసుకోండి. ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. మీ శరీరం కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులను గమనిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాట్టి రాత్రి నిద్ర కోసం బెడ్ కాకుండా నేలపై పడుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రధాన ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నేలపై పడుకోవడం ఈ తరం వారికి కొత్తగా, వింతగా అనిపించవచ్చు. కానీ, ఇది శతాబ్దాల నాటి అలవాటు. చాలా మంది ఇప్పటికీ వారి జీవనశైలిలో ఇది అత్యంత ముఖ్యమైన భాగంగా దీనిని ఆచరిస్తున్నారు. అయితే, మీరు కూడా మీ పరుపును వదిలి రెండు వారాల పాటు నేలపై పడుకోవటం అలవాటు చేసుకోండి. ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. మీ శరీరం కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులను గమనిస్తారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాట్టి రాత్రి నిద్ర కోసం బెడ్ కాకుండా నేలపై పడుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రధాన ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
రాత్రుళ్లు ఎక్కువగా పరుపుపై పడుకుంటున్న వారిలో వెన్ను, మెడ నొప్పి వంటి సమస్యలు తరచూగా వేధిస్తూ ఉంటాయి. అదే నేలపై పడుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేల లాంటి గట్టి ఫ్లోర్‌పై పడుకోవడం వల్ల వెన్నెముకని సరిగ్గా ఉంచి, వెన్నునొప్పిని తగ్గించంలో సాయపడతాయి. నేలపై పడుకోవడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. నేలతో అనుబంధం పెరుగుతుంది. పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు. మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. కంటినిండా నిద్రపడుతుందని చెబుతున్నారు.
నేలపై పడుకోవడం వల్ల భుజం, తుంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది వెన్నునొప్పి, భుజం నొప్పి, మెడ నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. నేలపై పడుకో వడం వల్ల శరీరానికి కావలసిన సహజమైన విశ్రాంతి లభిస్తుంది. ఇది మన వీపును నిటారుగా ఉంచుతుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. మనస్సులోని ఆందోళనలు తగ్గుతాయి.
నేలపై పడుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. మంచం మీద పడుకోవడం వల్ల శరీర వేడి పెరుగుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. నేలపై పడుకోవడం వల్ల రక్తపోటు నియంత్రించబడుతుంది. కండరాలు సడలించబడతాయి. ఒత్తిడి తగ్గుతుంది. మీరు భుజం, తుంటి నొప్పితో బాధపడుతుంటే, మీరు నేలపై పడుకోవాలి. నేలపై పడుకోవడం వల్ల మీ నొప్పి క్రమంగా తగ్గుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








