AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SP Balasubrahmanyam: నా తర్వాత.. నా అంతటివాడు అతనే: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

దివంగత గానగాంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తన 40 ఏళ్ల గాయక ప్రస్థాన విశేషాలను, ప్రస్తుత తరం గాయకులు ఎదుర్కొంటున్న సవాళ్లను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన గొంతు వయసు మీరిందని కొందరు అనుకోవడాన్ని ఖండించారు. యువ గాయకుడు శ్రీకృష్ణ వంటి ప్రతిభావంతులకు సరైన అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. నేపథ్య గాత్రం నిజమైన నిర్వచనాన్ని వివరించారు.

SP Balasubrahmanyam: నా తర్వాత.. నా అంతటివాడు అతనే: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
Sp Balasubrahmanyam
Ram Naramaneni
|

Updated on: Mar 19, 2026 | 8:55 PM

Share

ప్రముఖ నేపథ్య గాయకులు, దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తన సుదీర్ఘ గాయక ప్రస్థానం గురించి, ప్రస్తుత సంగీత ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి,  యువ గాయకుల భవిష్యత్తు గురించి ఓ ఇంటర్వ్యలో విస్తృతంగా మాట్లాడారు. 40 సంవత్సరాలకు పైగా అదే ఉత్సాహంతో పాటలు పాడుతూ కూడా, మొదటిసారి పాడుతున్న అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తానని ఆయన అప్పుడు వెల్లడించారు. చాలామంది గాయకులు కొన్ని సంవత్సరాల తర్వాత ఉత్సాహం కోల్పోయి వెనకడుగు వేస్తుండగా, బాలు గారు మాత్రం ఆయన చివరిపాట తన అంకితభావాన్ని కొనసాగించారు.  గాయనీ గాయకుల సంఖ్య పెరిగినప్పటికీ, ప్రతిభ ఉన్నవారికి సరైన అవకాశాలు లభించడం లేదని బాలు గారు ఆ సమయంలో అభిప్రాయపడ్డారు. ఒకానొక సమయంలో తాను పాడే పాటల సంఖ్య తగ్గినా, తనకు తగిన స్థాయికి చెందిన పాటలే వచ్చాయని, వాటిని తాను ఆస్వాదించినట్లు ఆయన తెలియజేశారు. అయితే, కొందరు క్రియేటర్లు తన గొంతు వయసు మీరిందని భావించడం అసంబద్ధమని ఆయన అప్పడు ఆయన వ్యాఖ్యానించారు. వయసు మీరిన నటీనటులకు అవకాశాలు వస్తున్నప్పుడు, గాయకుల గొంతు వయసు గురించి ఆలోచించడం లాజిక్ కాదని స్పష్టం చేశారు.

ఆధునిక పాటల ట్రాక్‌లతో తన గొంతును కలపడం ఇబ్బంది అవుతుందని కొందరు భావించడం, అలాగే తాను పైశృతిలో పాడలేకపోతున్నాననే అపప్రధలు తనపై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మంచి తెలుగు పాట వచ్చినప్పుడు, ఉచ్ఛారణకు ప్రాముఖ్యత ఉన్నప్పుడు మాత్రం తననే సంప్రదించేవారని తెలిపారు. ఘంటసాల వంటి దిగ్గజ గాయకుల తర్వాత తన గొంతు బలంగా ముందుకు వచ్చిందని బాలుగారు గుర్తు చేసుకున్నారు. అయితే, తన తర్వాత తరం నుంచి బలంగా తమ ఉనికిని చాటుకునే గొంతులు పెద్దగా రావడం లేదనే అభిప్రాయంపై ఆయన పూర్తిగా ఏకీభవించలేదు. మంచి ప్రతిభకు కొరత లేదని, అయితే ఆ ప్రతిభను జనం గుర్తించేటటువంటి అవకాశాలు వారికి లభించడం లేదని వివరించారు. తన కార్యక్రమంలో పాడి వెలుపలికి వచ్చిన శ్రీకృష్ణ వంటి అబ్బాయిలో మంచి సింగర్ కావాల్సిన అన్ని పారామీటర్లు ఉన్నాయని, అతనికి ఎక్కువ ఎక్స్పోజర్ అవసరమని నొక్కిచెప్పారు. నేపథ్య గాయకుడి నిర్వచనంలో కూడా మార్పు వచ్చిందని బాలుగారు తెలిపారు. ఈ సందర్భంలో లతా మంగేష్కర్ గారితో జరిగిన సంభాషణను ఉటంకించారు. ఒక మరాఠీ గాయకుడి గురించి లతాజీని అడిగినప్పుడు, ఆ గాయకుడు బాగా పాడినా సినిమాకు వాయిస్ కి ఒక నిర్వచనం ఉందని ఆమె చెప్పారని తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు అది వేరే ఎవరో పాడుతున్నట్టు ఉండకూడదని, స్క్రీన్ నిండా బొమ్మ కనపడ్డప్పుడు సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ నుంచి వాయిస్ వస్తున్నట్టు ఉండాలని లతాజీ వివరించారని, దీనికంటే మంచి నిర్వచనం తాను చెప్పలేనని బాలుగారు ముగించారు.

View this post on Instagram

A post shared by Filmfare (@filmfare)

Also Read: హరికృష్ణ, నేను సిగరెట్ తాగుతూ ఎన్టీఆర్‌కి దొరికిపోయాం… ఆ తర్వాత 

Follow Us