AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోకియా నుంచి మరో రఫ్ అండ్ టఫ్ కీప్యాడ్ ఫోన్: ‘నోకియా 123 షీల్డ్’ ప్రత్యేకతలివే

ప్రముఖ నోకియా మాతృ సంస్థ హెచ్‌ఎండీ (HMD) మార్కెట్లోకి మరో సరికొత్త కీప్యాడ్ ఫోన్‌ను తీసుకువచ్చింది. ఇటీవల ఏఐ ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేసిన హెచ్‌ఎండీ, ఇప్పుడు పూర్తి భిన్నంగా 1990ల నాటి లుక్స్‌తో రఫ్ అండ్ టఫ్ 'నోకియా 123 షీల్డ్' (Nokia 123 Shield)ను అధికారికంగా విడుదల చేసింది.

నోకియా నుంచి మరో రఫ్ అండ్ టఫ్ కీప్యాడ్ ఫోన్: 'నోకియా 123 షీల్డ్' ప్రత్యేకతలివే
Nokia 123 Shield
Nikhil
|

Updated on: Jul 28, 2026 | 8:05 AM

Share

ఐపీ65 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఏకంగా 19 రోజుల పాటు వచ్చే భారీ బ్యాటరీ లైఫ్‌తో ‘నోకియా 123 షీల్డ్’ (Nokia 123 Shield) ఫోన్ రూపుదిద్దుకుంది. కేవలం 2G నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్ చేసే ఈ రెట్రో స్టైల్ ఫోన్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం!

దృఢమైన డిజైన్

హెచ్‌ఎండీ సంస్థ తాజాగా పరిచయం చేసిన ‘నోకియా 123 షీల్డ్’ ఫోన్ అత్యంత దృఢమైన ప్లాస్టిక్ బాడీతో రఫ్ అండ్ టఫ్ వినియోగానికి అనుకూలంగా వచ్చింది. నీరు, దుమ్ము, దూళి లోపలికి వెళ్లకుండా ఈ ఫోన్ పోర్టులపై ప్రత్యేకంగా రబ్బర్ ఫ్లాప్‌లను అమర్చారు. అంతేకాకుండా దీనికి ‘IP65’ రేటింగ్ కూడా అందించడం విశేషం. కాబట్టి వర్షంలో తడిసినా లేదా కఠినమైన వాతావరణంలో వాడినా ఎలాంటి సమస్య ఉండదని నోకియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో కనుమరుగవుతున్న 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు సరికొత్త USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఇందులో చేర్చారు.

ప్రాసెసర్, స్టోరేజ్

ఈ సరికొత్త నోకియా ఫోన్ యునిసోక్ SC6531E ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో 4MB ర్యామ్, 4MB ఇంటర్నల్ స్టోరేజ్‌ను మాత్రమే అందించారు. అయితే ఫొటోలు, పాటలు దాచుకోవడానికి మైక్రో SD కార్డ్ సాయంతో స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకునే వెసులుబాటును కల్పించారు. అలాగే ఫోన్ వెనుక భాగంలో ఒక సాధారణ కెమెరాతో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఫ్లాష్‌లైట్‌ను కూడా అమర్చడం విశేషం. ఇది హెచ్‌ఎండీకి చెందిన ‘S30+’ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

అద్భుతమైన బ్యాటరీ లైఫ్

ఈ నోకియా ఫోన్‌లో ప్రధాన హైలైట్ దీని అసాధారణమైన బ్యాటరీ లైఫ్ అనే చెప్పాలి. ఇందులో 1750mAh రిమూవబుల్ బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 19 రోజుల పాటు నిరంతర బ్యాటరీ లైఫ్‌ను ఇది అందిస్తుంది. అలాగే 27.9 గంటల టాక్‌టైమ్‌ను ఈ బ్యాటరీ ద్వారా పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ఫోన్ కేవలం 2G నెట్‌వర్క్, డ్యూయల్ మినీ సిమ్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2G సేవలు నిలిచిపోతున్న తరుణంలో ఈ ఫీచర్ రావడం కొద్దిగా గమనార్హం.

ధర, లభ్యత వివరాలు

ఈ ఫోన్‌ను హెచ్‌ఎండీ ఆవిష్కరించినప్పటికీ, దీని అధికారిక ధర, సేల్స్ ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఫీచర్లను బట్టి చూస్తే ఇది రూ.2,500 నుంచి రూ.3,500 మధ్య ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రఫ్ అండ్ టఫ్ వినియోగానికి, ఎక్కువ రోజుల బ్యాటరీ లైఫ్ కోరుకునే కీప్యాడ్ ఫోన్ ప్రియులకు ఈ ‘నోకియా 123 షీల్డ్’ ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది. రెట్రో లుక్స్, మోడర్న్ టైప్-సి పోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ మార్కెట్లో ఎలాంటి స్పందన రాబడుతుందో వేచి చూడాలి.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?