AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలే హీరోలుగా అద్భుతమైన కథలు: మెటా ‘స్టోరీకిట్’ యాప్ ప్రత్యేకతలు ఇవే

ప్రతిరోజూ రాత్రి పూట పిల్లల్ని పడుకోబెట్టడానికి కొత్త కథలు వెతికి అలసిపోతున్న తల్లిదండ్రుల కోసం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ఒక అద్భుతమైన ఏఐ యాప్‌ను పరిచయం చేస్తోంది. 'స్టోరీకిట్' (StoryKit) పేరుతో వస్తున్న ఈ వినూత్న యాప్ పిల్లల ఫొటోలు, వారి అభిరుచులకు తగినట్టుగా నచ్చిన కథలను క్షణాల్లో తయారు చేసి ఇస్తుంది

పిల్లలే హీరోలుగా అద్భుతమైన కథలు: మెటా 'స్టోరీకిట్' యాప్ ప్రత్యేకతలు ఇవే
Meta Announces Storykit Ai App
Nikhil
|

Updated on: Jul 28, 2026 | 8:20 AM

Share

పిల్లల ఫొటోలు అప్‌లోడ్ చేసి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్‌తో కూడిన ప్రత్యేకమైన కథలను రూపొందించుకోవడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం పెద్దల కోసం మాత్రమే డిజైన్ చేయబడి, పూర్తి భద్రతా ఫిల్టర్లతో వస్తున్న ఈ మెటా స్టోరీకిట్ యాప్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం!

‘స్టోరీకిట్’ పనిచేసే విధానం

సాధారణంగా రోజూ కొత్త కథలు చెప్పడం తల్లిదండ్రులకు కాస్త కష్టమైన పనే. రోజూ కొత్త కథ ఎక్కడి నుంచి తేవాలో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా మెటా ‘స్టోరీకిట్’ అనే కొత్త ఏఐ యాప్‌ను తీసుకువస్తోంది. ఈ యాప్ పనిచేసే విధానం చాలా సరదాగా ఉంటుంది. ముందుగా పిల్లల ఫొటో లేదా ఇష్టమైన బొమ్మ ఫొటోను అప్‌లోడ్ చేయాలి.

ఆ తర్వాత కథ ఎక్కడ జరగాలి? అడవిలోనా, అంతరిక్షంలోనా లేదా వింత లోకంలోనా అనేది ఎంచుకోవాలి. చివరగా దయ, ధైర్యం, స్నేహం వంటి మంచి అలవాట్లలో దేనిని నేర్పించాలో సెలెక్ట్ చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్షణాల్లో బొమ్మలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్‌తో కూడిన చక్కటి కథను సిద్ధం చేస్తుంది.

పిల్లల రక్షణకు…

పిల్లల చేతికి ఏఐ యాప్స్ ఇస్తే ముప్పు ఉంటుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. కానీ మెటా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ యాప్‌ను కేవలం 18 ఏళ్లు నిండిన పెద్దలు మాత్రమే వాడేలా రూపకల్పన చేశారు. ఇందులో ఎలాంటి సోషల్ మీడియా ఫీచర్లు లేదా షేరింగ్ ఆప్షన్లు ఉండవు. అలాగే పిల్లలకు హాని కలిగించే విషయాలు రాకుండా ప్రత్యేక సేఫ్టీ ఫిల్టర్లను పకడ్బందీగా అమర్చారు.

వివిధ రకాల స్టోరీ మోడ్స్

ఈ యాప్‌లో కథలను నచ్చిన రూపంలో పొందవచ్చు. బొమ్మలు చూస్తూ, సంగీతం వింటూ చదువుకోవడానికి ‘పిక్చర్ బుక్’ ఆప్షన్ ఉంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా పడుకునేటప్పుడు వినడానికి ‘ఆడియో బుక్’ కూడా అందుబాటులో ఉంది. స్వయంగా కథ చెప్పాలనుకునే వారి కోసం ‘రీడ్ అలావుడ్’ మోడ్ ఉంది. అంతేకాకుండా ఆ కథను పీడీఎఫ్ (PDF) ప్రింట్ రూపంలో తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ప్రస్తుతం మెటా ఈ యాప్‌ను మెక్సికో వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరీక్షిస్తోంది. తీరిక లేని సమయంలో తల్లిదండ్రులకు ఇదొక అద్భుతమైన సహాయకారిగా నిలవడం ఖాయం.

Follow Us