AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోదారోళ్లను మించిన సంప్రదాయం.. కొత్త అల్లుడికి 101 వంటకాలతో పసందైన భోజనం!

పండగకు ఇంటికొచ్చే కొత్త అల్లుడికి రాజమర్యాదలు ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటారు అత్తమామలు. తెలంగాణకు చెందిన దంపతులు కూడా సరిగ్గా ఇలాగే అనుకున్నారు. తెలుగు వారి తొలి పండుగ ఉగాదికి ఇంటికొచ్చిన అల్లుడికి ఏకంగా 101 వంటకాలతో పసందైన భోజనం వడ్డించాలనుకున్నారు. అన్నట్లు అన్నిరకాలు వండివార్చారు.

గోదారోళ్లను మించిన సంప్రదాయం.. కొత్త అల్లుడికి 101 వంటకాలతో పసందైన భోజనం!
Family Serves 101 Variety Food Items To Newly Wed Couple
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 19, 2026 | 8:44 PM

Share

పండగకు ఇంటికొచ్చే కొత్త అల్లుడికి రాజమర్యాదలు ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటారు అత్తమామలు. తెలంగాణకు చెందిన దంపతులు కూడా సరిగ్గా ఇలాగే అనుకున్నారు. తెలుగు వారి తొలి పండుగ ఉగాదికి ఇంటికొచ్చిన అల్లుడికి ఏకంగా 101 వంటకాలతో పసందైన భోజనం వడ్డించాలనుకున్నారు. అన్నట్లు అన్నిరకాలు వండివార్చారు. అద్భుతమైన ఆతిథ్యంతో ఆ అల్లుడి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉగాది పండుగ సందర్భంగా కుటుంబ ఆతిథ్యానికి సరి కొత్త అర్థాన్ని ఇచ్చిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. నాలుగు రోజుల క్రితం తమ కూతురుని వివాహం చేసుకున్న అల్లుడు తొలిసారి పండుగకు అత్తారింటికి వచ్చాడు. దీంతో గోదావరిఖని రాజ్యలక్ష్మి కాలనీకి చెందిన అత్తమామలు అల్లునికి అపూర్వమైన స్వాగతం పలికారు. సంప్రదాయాలకు అనుగుణంగా కాకుండా మరింత వైవిధ్యంగా ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా 101 రకాల వంటకాలతో పసందైన భోజనం ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఉగాది పండుగ రోజున తెల్లవారుజామునే ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అల్లుడిని ఆప్యాయంగా సన్మానించారు. ఆ తర్వాత సాంప్రదాయ వంటకాలతో పాటు పులిహోర, బబ్బట్లు, పాయసం, వడలు, పచ్చళ్ళు, స్వీట్లు, ఫ్రై ఐటమ్స్ ఇలా 101 విభిన్న రకాల వంటకాలతో భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ అరుదైన ఆతిథ్యం చూసిన బంధువులు, ఇరుగు పొరుగువారు ఆశ్చర్యపోయారు. అల్లుడిని దేవుడిలా భావించే తెలుగు సంప్రదాయం ఇదే అని పెద్దలు అభిప్రాయపడ్డారు. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన గోదావరిఖనిలో ఉగాది ప్రత్యేకతగా నిలిచింది. తెలంగాణ సంప్రదాయం, ప్రేమ, ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచిoది. అందరికీ ఆదర్శంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు