AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 13, 2026) ప్రకారం కొన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశాలు ఉండగా, మిథున రాశి వారి సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. మరోవైపు కొన్ని రాశుల వారు ఖర్చులు, బాధ్యతల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ శనివారం ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..12 రాశుల వారికి రాశిఫలాలు
Rashifal In Telugu 13 June 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 13, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూన్ 13, 2026): మేష రాశి వారికి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, కొన్ని అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో చాలా వరకు నష్టాల నుంచి బయటపడతారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్ వంటి వృత్తుల్లో ఉన్నవారు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, కొన్ని అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులుంటాయి. వ్యాపారాల్లో కొందరు సన్నిహితులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మాటకు విలువ ఉంటుంది. బంధు మిత్రులు మీ సలహాలు స్వీకరిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లలో బాగా లాభపడే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరణ, గౌరవాభిమానాలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సఫలమవుతాయి. ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుకుంటారు. షేర్లు బాగా కలిసి వస్తాయి. మిత్రుల వల్ల డబ్బు నష్టపోతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మంచి కంపెనీల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సఫలమవుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీల్లో ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందడం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి చెందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా అనుకూల ఫలితాలని స్తుంది. వ్యాపారాల్లో అనుకోకుండా లాభాలు పెరుగుతాయి. కుటుంబానికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ద పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు సమసిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపా రాల్లో లాభాలు ఆర్జిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో వివాదాలు, విభేదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృథా ఖర్చుల్ని వీలైనంగా తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపా రాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. వ్యక్తిగత పురోగతికి అవకాశం ఉంది. శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. పిల్లలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో ప్రాభవం పెరగడంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి పురోగతి చెందుతాయి. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగు పడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వాగ్దానాలు చేయవద్దు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. అంచనాలకు మించి జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. సోదర వర్గంలో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అధికారులతో వీలైనంత సామరస్యంగా వ్యవహరించడం మంచిది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో మరింతగా శుభ ఫలితాలుపొందుతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అన్ని విధాలా కలిసి వచ్చే సమయం ఇది. ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో అధికారం చేపడతారు. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆరోగ్యానికి లోటుండదు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..