AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో.. మామిడి పండ్లు తిని ఇద్దరు మృతి

Phani CH
|

Updated on: Jun 12, 2026 | 6:36 PM

Share

హైదరాబాద్‌లో మామిడి పండ్లు తిన్న అనంతరం ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. నారాయణగూడ ప్రాంతంలో కొనుగోలు చేసిన మామిడి పండ్లు తిన్న కుటుంబ సభ్యులకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 17 ఏళ్ల భువనేశ్వరి, 10 ఏళ్ల సంధ్య మృతి చెందగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మొన్న పుచ్చకాయ.. ఇవాళ మామిడిపండు.. మనం ఏం కొంటున్నాం..ఏం తింటున్నాం.. చేజేతులా విషం కొనుక్కొని తింటున్నామా అంటే అవుననే అనిపిస్తోంది. ముంబైలో పుచ్చకాయ ఏకంగా కుటుంబాన్నే బలితీసుకుంటే.. ఇప్పుడు మామిడి పండు తిని ఇద్దరు అమ్మాయిలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌ నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆ మామిడి పండ్లు వారి పాలిట విషాహారంగా మారిపోయాయి. ఇటీవల మామిడి పండ్లు తిన్న ఆ కుటుంబంలోని ఇద్దరు అమ్మాయిలు కొద్ది రోజుల వ్యవధిలోనే చనిపోవడం కలకలం రేపుతోంది. మామిడి పండ్లు తిని అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అక్కచెల్లెళ్ళు మృతి చెందారు. గత సోమవారం 17 ఏళ్ల భువనేశ్వరి మృతి చెందగా మంగళవారం ఆమె చెల్లెలు పదేళ్ల సంధ్య చికిత్స పొందుతూ మృతి చెందింది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతానికి వైజినాథ్, ఇందుమతి దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి విఠల్ వాడిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వారి బంధువైన రేణుక వీరి ఇంటికి వస్తున్న క్రమంలో నారాయణగూడలోని జలమండలి సమీపంలో మామిడి పండ్లను కొని తీసుకొచ్చారు. వాటిని తల్లి ఇందుమంతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు. ఆదివారం సాయంత్రం మామిడిపండ్లు తిన్న ఐదుగురికి వాంతులు, విరేచనాలు మొదలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ వైజినాథ్ మూడో కుమార్తె భువనేశ్వరి సోమవారం మృతి చెందారు. మంగళవారం భువనేశ్వరి సోదరి సంధ్య కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభుత్వ కీలక నిర్ణయం..ఇకపై అన్ని శనివారాలు సెలవు

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మెనూలోకి రానున్న పప్పు

మామిడి టెంకలను పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలు పడేయరు

Vitamin D: ‘సన్‌షైన్’ విటమిన్… ఇది లోపిస్తే చాలా కష్టం!

Top 9 ET News: ప్రభాస్‌తో ధురంధర్ దర్శకుడు సినిమా.. ఇదిగో క్లారిటీ..

Follow Us