పవన్ కళ్యాణ్ ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెన్ జీ గురించి ప్రస్తావించారు. ప్రతి 20 ఏళ్లకు ఒక తరం వస్తుందని, తన కుమారుడి స్నేహితుల్లో కొందరు కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ వేదికలో చేరారని తెలిపారు. యువత కోపాన్ని తాను అర్థం చేసుకోగలనని, కానీ దిశానిర్దేశం లేని కోపం వల్ల ప్రయోజనం లేదని పవన్ స్పష్టం చేశారు. సమస్య పరిష్కార నేతలు కావాలని పిలుపునిచ్చారు.