యూపీలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన ఇది. అనారోగ్యంతో మరణించిన 35 ఏళ్ల గీతాదేవి మృతదేహం పక్కన, సహాయం కోసం ఆమె ఏడేళ్ల కుమారుడు 24 గంటల పాటు నిరీక్షించాడు. ఎవరూ ఆదుకోకపోవడంతో స్థానిక సామాజిక కార్యకర్తలు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన సమాజంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.