మక్తామాసాన్ పల్లి గ్రామస్తులు మద్యంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలను నివారించేందుకు మద్యపానాన్ని నిషేధించారు. గ్రామంలో మద్యం అమ్మినా, కొన్నా రూ. 5 లక్షల భారీ జరిమానా విధిస్తారు. మహిళా సంఘాలు, యువకులు, పెద్దలు ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.