మటన్ ఫ్రై.. ఇలా చేస్తే చాలు ముక్క మెత్తగా.. నోటికి రుచిగా ఉంటది

Samatha

12 June 2026

మటన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ కనీసం వారానికి ఒక్కసారి అయినా మటన్‌ను ఇష్టంగా తింటారు.

మటన్

ఇక కొందరికి మటన్ ఫ్రై అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అయితే ముక్క మెత్తగా నోటికి రుచిగా ఉండేలా మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.

మటన్

కావాల్సిన పదార్థాలు.. అరకేజీ మటన్, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చీ, కారం, ధనియాల పొడి.

కావాల్సిన పదార్థాలు

గరం మాసాలా, పసుపు, నూనె, మసాలా, కొత్తిమీర, పూదీన, ముందుగా మటన్ కడిగి శుభ్రం చేసి పసుపు, కారం, అల్లం పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

మసాలాలు

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, నూనె పోసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి, బిర్యానీ ఆకు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి.

స్టవ్ ఆన్

తర్వాత పసుపు వేసి వేయించుకోవాలి. దీని తర్వాత మటన్ వేసి బాగా వేయించుకోవాలి. మటన్ మంచి వేగిన తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ ఉడకబెట్టుకోవాలి.

మటన్ ఉడకబెట్టడం

మటన్ కాస్త మెత్తగా ఉడికిన తర్వాత, కారం, ఉప్పు, గరం మసాలా , ధనియాల పొడి అన్నీ వేసి మటన్ దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి.

మెత్తగా ఉడకడం

ఇక  ముక్క మెత్తగా ఉడికి దేనికి అది వేరుగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై రెడీ.

టేస్టీ టేస్టీ