AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లిలో గులాబ్‌జామున్‌ దొంగ.. కెమెరామెన్‌ ఎదురుపడగానే ఏం చేసిందంటే…

ప్రతిరోజూ సోషల్ మీడియాలో వివిధ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఒక ఫన్నీపెళ్లి వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఒక మహిళ గులాబ్ జామున్లు చూసి ఆగలేకపోతుంది. తన మీద తానే నియంత్రణ కోల్పోతుంది. ఆ మహిళ చేసిన పనులు, అక్కడి స్థానికులతో పాటుగా, వీడియో చూసిన నెటిజన్లలో నవ్వులు పూయిస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Viral Video: పెళ్లిలో గులాబ్‌జామున్‌ దొంగ.. కెమెరామెన్‌ ఎదురుపడగానే ఏం చేసిందంటే...
Gulab Jamuns
Jyothi Gadda
|

Updated on: Nov 13, 2025 | 10:51 AM

Share

ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ వినియోగదారులలో ఎక్కువ మంది ప్రజాదరణ పొందుతోంది. ఈ వైరల్ వీడియో ఒక పెళ్లికి సంబంధించినది. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు భోజనాల వద్దకు చేరుకున్నారు. అందరూ ఎవరికి వారుగా తమ ప్లేట్లలో ఆహారాన్ని వడ్డించుకుంటున్నారు. అంతలోనే ఒక మహిళ తన ప్లేట్‌ను గులాబ్ జామున్‌లతో నింపుకోవటం కనిపిస్తుంది. ఇంతలో, ఒక కెమెరామెన్ వెనుక నుండి ఆమెను ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడు.

ఆ మహిళ తన ప్లేట్‌ నిండా గులాబ్ జామున్ తీసుకొని వెళ్ళిపోతుండగా, కెమెరామెన్ ఆమెను ఫోటో తీయబోయాడు.. దానికి ఆమె సిగ్గుపడుతూ, వెంటనే గులాబ్‌ జామున్లన్నింటినీ వెనక్కి పెట్టి ప్లేట్‌లో ఒక ముక్క మాత్రమే తీసుకుంటుంది. ఆమె చుట్టూ ఉన్నవారు ఆమె చేసిన పనికి తెగ నవ్వుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను @neeridresi అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్ ఇలా ఉంది. గులాబ్ జామున్ ది క్వీన్ ఆఫ్ వెడ్డింగ్ డెజర్ట్స్. అని రాశారు. మా భాభి ఈ హాట్ అండ్ జ్యుసి ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. ఒకేసారి 10 వడ్డించుకున్నారు. కానీ, కెమెరామెన్ రాంగ్‌ ఎంట్రీతో పాపం ఆమెకు నిరాశ ఎదురైంది. కానీ, ఆ తరువాత ఏం జరిగిందో చూడండి.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో చూసిన తర్వాత వినియోగదారులు అనేక రకాల కామెంట్స్‌ చేశారు. దీనిలో ఒకరు ఇలా అన్నారు..గులాబ్ జామున్ నిజంగా ప్రతి పెళ్లికి గర్వకారణం, వేడిగా, తేనెలాగా తీపిగా ఉంటుంది. అందుకే మీ బాబీ 10గులాబ్‌జామూన్‌లను ఒకేసారి తినాలనుకున్నారు. కానీ, కెమెరామెన్ ఎంట్రీ ఆ దృశ్యాన్ని వైరల్ చేశారు అంటూ వ్యాఖ్యానించారు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..