AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ విధంగా దీపం పెట్టారంటే ఇంట్లో దోమలు పరార్ అవ్వాల్సిందే..! ట్రై చేయండి..

దోమల నివారణ కోసం రసాయనాలను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా..మన వంటగదిలో లభించే పదార్థాలను ఉపయోగించి దోమలను తరిమికొట్టవచ్చు. మీరు కూడా ఈ దోమల బెడద నుండి బయటపడాలనుకుంటున్నారా? దీనికి ఇంట్లో కొన్ని వస్తువులు సరిపోతాయి. దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు.. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకోవడానికి పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే...

ఈ విధంగా దీపం పెట్టారంటే ఇంట్లో దోమలు పరార్ అవ్వాల్సిందే..! ట్రై చేయండి..
Natural Mosquito Repellent
Jyothi Gadda
|

Updated on: Nov 13, 2025 | 9:02 AM

Share

సీజన్‌తో పనిలేదు.. సాయంత్రం అయిందంటే దోమలు దండయాత్ర మొదలుపెడతాయి. అవి మనల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వవు. చెవుల దగ్గర జివ్వు మంటూ, కుడుతూ రక్తం తాగేస్తుంటాయి. దోమల బెడదతో కొంతమంది మస్కిటో కాయిల్స్‌, లోషన్లు వాడుతుంటారు. వాసన రాకుండా ఉండేందుకు మార్కెట్లో కొన్ని రసాయన ఉత్పత్తులు కూడా వచ్చాయి. వీటి వాసన ఇబ్బంది పెట్టదు. కానీ, కెమికల్‌ ఆధారిత ఉత్పత్తులు ఏవైనా సరే.. ఎప్పుడో ఒకప్పుడు సైడ్‌ ఎఫెక్ట్స్ కలిగించక మానదు. అందుకే రసాయనాలను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా..మన వంటగదిలో లభించే పదార్థాలను ఉపయోగించి దోమలను తరిమికొట్టవచ్చు. మీరు కూడా ఈ దోమల బెడద నుండి బయటపడాలనుకుంటున్నారా? దీనికి ఇంట్లో కొన్ని వస్తువులు సరిపోతాయి. దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు.. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకోవడానికి పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే…

సాధారణంగా ప్రతి ఒక్కరి వంటింట్లో ఉల్లిపాయలను తప్పక ఉపయోగిస్తారు. కానీ, ఉల్లిపాయలు దోమలను తరిమికొట్టడానికి ఉపయోగపడతాయని తెలిస్తే మీరు నమ్ముతున్నారా? అవును, మీరు ఉల్లిపాయలతో దోమలను సులభంగా తరిమికొట్టవచ్చు. ఉల్లిపాయలలో సల్ఫర్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని వాసన దోమలకు నచ్చదు. ఉప్పు ఈ సల్ఫర్ సమ్మేళనాల వాసనను పెంచడానికి, వాటిని గాలిలో చెదరగొట్టడానికి సహాయపడుతుంది. దీని కారణంగా, దోమలు ఆ ప్రదేశానికి రావు. వాటికి ఈ వాసన నచ్చదు.

దోమల నివారిణిని ఎలా తయారు చేయాలి?

ఇవి కూడా చదవండి

దోమల వల్ల రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా..? అయితే, ఈ హోం రెమిడీ ట్రై చేయండి..ఇందుకోంస మీరు మీ వంటింట్లో ఉండే ఉల్లిపాయతో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని మీ బెడ్ రూమ్, పిల్లల రూమ్‌ , హాల్‌, వంటగదిలో ఉంచుకోవచ్చు. ఉల్లిపాయ దీపం తయారు చేయడానికి కావాల్సిన అవసరమైన పదార్థాలు ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు నుండి మూడు కర్పూరం ముక్కలు, కొన్ని నల్ల మిరియాలు,ఆవ నూనె, కాటన్ విక్ తీసుకోవాలి.

దీపం ఎలా తయారు చేయాలి?:

ఉల్లిపాయ పైభాగాన్ని కత్తిరించండి. ఉల్లిపాయను దీపం ఆకారంలో కత్తిరించుకోవాలి. ఇలా తయారైన ఉల్లిపాయ దీపంలో కర్పూరం, నల్ల మిరియాల పొడితో నింపుకోవాలి. ఆ బోలు భాగంలో ఆవ నూనె పోసి, ఒక కాటన్ విక్ చొప్పించండి. మీ గదిలో ఒక మూలలో ఉల్లిపాయ దీపం ఉంచుకుని, వత్తిని వెలిగించండి. ఒకటి లేదా రెండు నిమిషాల్లోనే ఫలితం మీకు తెలుస్తుంది.

ఉల్లిపాయ దీపం వాసనకు దోమలు తలలు తిరిగి నేలపై పడతాయి. ఎందుకంటే, దోమలు కర్పూరం, నల్ల మిరియాలు, ఉల్లిపాయల వాసనను తట్టుకోవు. వెంటనే ఎగిరిపోతాయి లేదా చనిపోతాయి.

ఉల్లిపాయలు విడుదల చేసే కర్పూరం, ఆవాల నూనె, సల్ఫర్ సమ్మేళనాల వాసన దోమలను తరిమికొడుతుంది. ఈ పద్ధతి పూర్తిగా సురక్షితం, ముఖ్యంగా పిల్లలు లేదా వృద్ధులు ఉన్న ఇళ్లకు ఉపయోగపడుతుంది.

ఈ ఉల్లిపాయ దీపం దోమలను వదిలించుకోవడానికి మీకు సహాయపడటమే కాకుండా దోమల నివారణ మందుల ఖర్చును కూడా ఆదా చేస్తుంది. శీతాకాలపు రాత్రులలో మీ ఇంటిని దోమల నుండి దూరంగా ఉంచడానికి ఇది ఒక సులభమైన మార్గం. దీన్ని ఒకసారి ప్రయత్నించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..