రోగనిరోధక శక్తి: మునగకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.
ఎముకల బలం: ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి.
షుగర్ వ్యాధి నియంత్రణ: మునగకాయలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
రక్తహీనత: ఐరన్ లోపంతో బాధపడేవారికి మునగకాయలు, ముఖ్యంగా మునగాకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.
జీర్ణక్రియ మెరుగుదల: ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
కంటి చూపు: విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రేచీకటి వంటి సమస్యలను ఇది నివారిస్తుంది.
రక్త శుద్ధి: మునగకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల చర్మ సమస్యలు తగ్గి, ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మం ఆరోగ్యంగా మారుతుంది. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది.
ముఖ్య గమనిక: మునగ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, గర్భిణీలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.